గుజ‌రాత్ స్పిన్న‌ర్ల ధాటికి పంజాబ్ బ్యాట్స్‌మెన్ విల‌విల‌

ఐపీఎల్ 2024 37వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది

By Medi Samrat  Published on  22 April 2024 7:16 AM IST
గుజ‌రాత్ స్పిన్న‌ర్ల ధాటికి పంజాబ్ బ్యాట్స్‌మెన్ విల‌విల‌

ఐపీఎల్ 2024 37వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 3 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. పంజాబ్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి సాధించింది. జట్టు తరపున రాహుల్ తెవాటియా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 17 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అంత‌కుముందు గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 35 పరుగులు చేశాడు. పంజాబ్ బౌల‌ర్ల‌లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ మూడు, లివింగ్‌స్ట‌న్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణిత 20 ఓవ‌ర్ల‌లో 142 పరుగులకే ఆలౌటైంది. జట్టు తరఫున ప్రభ్‌సిమ్రాన్ సింగ్ అత్య‌ధికంగా 35 పరుగులు చేయగా.. చివర్లో స్పిన్న‌ర్ హర్‌ప్రీత్ బ్రార్ 29 పరుగులు చేశాడు. బౌలింగ్ లో గుజరాత్ తరఫున సాయి కిషోర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ర‌షీద్ ఖాన్ ఒక‌టి, నూర్ అహ్మ‌ద్ రెండు వికెట్లు చొప్పున తీశారు. గుజరాత్‌కు ఇది నాలుగో విజయం కాగా.. పంజాబ్‌కు ఆరో ఓటమి ఎదురైంది.

Next Story