IPL Auction : మెగా వేలంలో జాక్‌పాట్ కొట్టిన అర్ష్‌దీప్ సింగ్
ఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమైంది.
By Medi Samrat Published on 24 Nov 2024 4:09 PM ISTఐపీఎల్ 2025 కోసం ఆటగాళ్ల మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ప్రారంభమైంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులందరూ కూడా వేలానికి హాజరయ్యారు. నేడు తొలిరోజు వేలంపాట కాగా.. ఇది సోమవారం వరకు కొనసాగనుంది. భారత ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వేలంలో మొదటి వ్యక్తి. అర్ష్‌దీప్ బేస్ ధర రూ. 2 కోట్లు కాగా.. రైట్ టు మ్యాచ్ (ఆర్‌టీఎం) కార్డు ద్వారా ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. అర్ష్‌దీప్‌పై వేలంపాటను చెన్నై సూపర్ కింగ్స్ ప్రారంభించింది.. అతడి కోసం CSK, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. తర్వాత రాజస్థాన్, గుజరాత్ కూడా బిడ్డింగ్‌లోకి దూసుకురాగా.. చివరికి సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.15.75 కోట్లకు బిడ్ వేసింది. హైదరాబాద్ బిడ్ వేసిన వెంటనే అర్ష్‌దీప్ కోసం ఆర్‌టీఎంను ఉపయోగించడం గురించి పంజాబ్‌ను అడిగారు. పంజాబ్ అర్ష్‌దీప్ పట్ల ఆసక్తిని వ్యక్తం చేసింది. దీని తర్వాత హైదరాబాద్ 18 కోట్లను ఆఫర్ చేసింది.. దీనికి పంజాబ్ అంగీకరించింది.
దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబడాది రెండో స్థానం. అతని ప్రాథమిక ధర రూ. 2 కోట్లు కాగా.. ఈ బౌలర్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. రబడ అంతకుముందు పంజాబ్ తరఫున ఆడాడు.. కానీ పంజాబ్ రబాడ కోసం RTMని ఉపయోగించలేదు.