ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

పూణెలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలిన ఘటనలో మృతి చెందాడు

By Medi Samrat  Published on  6 May 2024 8:30 PM IST
ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

పూణెలో తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న 11 ఏళ్ల బాలుడి ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలిన ఘటనలో మృతి చెందాడు. ఈ ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. శౌర్య బౌలింగ్ చేస్తున్నప్పుడు బ్యాట్స్‌మన్ బంతిని అతని వైపు నేరుగా కొట్టాడు. బంతి శౌర్య ప్రైవేట్ భాగాలను తాకింది. వెంటనే అతను నేలపై కుప్పకూలిపోవడం సీసీటీవీలో రికార్డు అయింది. అతని స్నేహితులు వెంటనే అతని దగ్గరకు పరుగెత్తారు. అనంతరం శౌర్యను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ ఆడుతూ ఉండగా శౌర్య బౌలింగ్ వేస్తూ వచ్చాడు. బ్యాట్స్మెన్ ఓ బంతిని బలంగా బాదగా అది కాస్తా డైరెక్ట్ గా శౌర్యకు తగిలింది. వెంటనే బ్యాట్స్మెన్, ఇతరులు అతడి దగ్గరకు వెళ్లగా.. వెంటనే కిందకు పడిపోయాడు శౌర్య. ఇంతలో క్రికెట్ ఆడుతున్న పిల్లలు ఇతరులకు చెప్పడంతో శౌర్యను అక్కడి నుండి తీసుకుని వెళ్లడం సీసీటీవీలో రికార్డు అయింది.

Next Story