భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)అధ్యక్షురాలిగా లెజెండరీ అథ్లెట్ పీటీ ఉష ఎన్నికయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆమెకు అభినందనలు తెలిపారు. 58 ఏళ్ల ఉష ఆదివారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసింది. ఇక మరెవరూ ఈ పదవికి నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఉష ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఈ పదవిని అధిరోహించనున్న మొదటి మహిళగా ఉష నిలిచారు.
క్రీడా రంగంలోఆమె చేసిన కృషికి గాను బీజేపీ పీటీ ఉషను 2022 జూలై 6న రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇక ఐఓఏలోని మిగతా 12 పదవుల కోసం 24 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వచ్చే నెల 10న ఐఓఏ ఎన్నికలు జరుగుతాయి. ఈ పదవికి నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు గతంలో ఎమ్మెల్యే ఉష తెలిపారు. "నా తోటి అథ్లెట్లు జాతీయ సమాఖ్యల హృదయపూర్వక మద్దతుతో, IOA అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయడం ఎంతో గౌరవంగా ఉంది!" పీటీ ఉష శనివారం ట్వీట్ చేశారు.