అక్టోబర్ 18 నుంచి ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 11 ప్రారంభం కానుంది. పీకేఎల్ 11వ సీజన్ షెడ్యూల్‌ను లీగ్ ఆర్గనైజర్ మషాల్ స్పోర్ట్స్ సోమవారం ప్రకటించింది. హైదరాబాద్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ యు ముంబా, దబాంగ్ ఢిల్లీ మధ్య జరగనుంది. ప్లేఆఫ్‌ల షెడ్యూల్, వేదిక తర్వాత ప్రకటించబడతాయి.
ఈసారి మూడు నగరాల్లో పీకేఎల్ జరుగనుంది. ప్రస్తుత 2024 ఎడిషన్ మొదటి దశ అక్టోబర్ 18 నుండి నవంబర్ 9 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 10 నుండి డిసెంబర్ 1 వరకు రెండవ దశ నోయిడా ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. మూడో దశకు పూణెలోని బాలెవాడి బ్యాడ్మింటన్ స్టేడియం డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 24 వకూ ఆతిథ్యం ఇవ్వనుంది.
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 వేలం ఆగష్టు 15-16 తేదీలలో ముంబైలో జరిగింది. వేలం లీగ్ చరిత్రలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ ఏడాది ఎనిమిది మంది ఆటగాళ్లు కోటి రూపాయలకు పైగా అమ్ముడుపోయారు. సచిన్ తన్వర్ అత్యంత ఖరీదైన ఆటగాడు. అతడిని తమిళ్ తలైవాస్ రూ. 2.15 కోట్లకు కొనుగోలు చేసింది. మహ్మద్రెజా షాద్లోయ్ చియానెహ్‌ను హర్యానా స్టీలర్స్ రూ. 2.07 కోట్లకు కొనుగోలు చేసింది.
ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 అన్ని మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. పుణెరి పల్టన్ 28-25తో హర్యానా స్టీలర్స్‌ను ఓడించడంతో PKL సీజన్ 10 ఉత్కంఠభరితంగా ముగిసింది. పుణెరి పల్టాన్ తొలిసారి ఛాంపియన్‌గా నిలిచింది.