టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ పంపిణీ.. జ‌ట్ల‌పై డ‌బ్బుల‌ వర్షం కురిపించిన ఐసీసీ..!

2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది.

By -  Medi Samrat
Published on : 11 March 2026 5:29 PM IST

టీ20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ పంపిణీ.. జ‌ట్ల‌పై డ‌బ్బుల‌ వర్షం కురిపించిన ఐసీసీ..!

2026 టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. భారత జట్టు అనేక రికార్డులను కూడా సృష్టించింది. టీ20 ప్రపంచ కప్‌ను మూడోసారి గెలుచుకున్న తొలి జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. అంతేకాకుండా భారత్ వరుసగా టైటిళ్లను గెలుచుకుంది. విజయం తర్వాత బీసీసీఐ భారత జట్టుకు ₹131 కోట్ల న‌జ‌రానా ప్రక‌టించింది. ఇప్పుడు.. ఐసీసీ ప్రైజ్ మనీని కూడా ప్రకటించింది. విజేత భారత్ నుండి 20వ స్థానంలో నిలిచిన ఒమన్ జట్టు వరకు, ప్రతి ఒక్కరికీ డబ్బుల వర్షం కురిపించింది.

2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ విజయవంతంగా ముగిసిన తర్వాత.. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) ఆటగాళ్లకు US$11.25 మిలియన్లు (₹1 బిలియన్, 39 కోట్ల, 4 లక్షల, 43 వేలు) ప్రైజ్ మనీ పంపిణీని నిర్ధారించింది. ఇది 2024లో ప్రకటించిన ఐసిసి ప్రైజ్ మనీలో రికార్డు స్థాయిలో పెరుగుదలకు అనుగుణంగా ఉందని ఐసిసి విడుదల తెలిపింది.

టైటిల్ గెలుచుకున్న భారత జట్టు ₹242.8 మిలియన్లు అందుకుంది. ఓడిన ఫైనలిస్టు న్యూజిలాండ్ ₹130 మిలియన్లు అందుకుంది. సెమీ-ఫైనల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికా ₹90 మిలియన్లు, ఇంగ్లాండ్ సుమారు ₹80 మిలియన్లు అందుకుంది. వెస్టిండీస్, పాకిస్తాన్, జింబాబ్వే, శ్రీలంక జట్లు ఒక్కొక్కటి సుమారు ₹40 మిలియన్లు అందుకున్నాయి.

భారతదేశం – $2,639,423 (రూ. 24,28,49,351)

న్యూజిలాండ్ – $1,422,692 (రూ. 13,08,91,789)

దక్షిణాఫ్రికా – $1,005,577 (రూ. 9,24,89,855)

ఇంగ్లాండ్ – $974,423 (రూ. 8,96,49,741)

వెస్టిండీస్ – $538,269 (రూ. 4,95,19,222)

పాకిస్తాన్ – $522,692 (రూ. 4,80,86,182)

జింబాబ్వే – $491,538 (రూ. 4,52,20,103)

శ్రీలంక – $475,962 (రూ. 4,37,87,155)

ఆఫ్ఘనిస్తాన్ – $309,808 (రూ. 2,85,01,248)

ఆస్ట్రేలియా – $309,808 (రూ. 2,85,01,248)

USA – $309,808 (రూ. 2,85,01,248)

స్కాట్లాండ్ – $278,654 (రూ. 2,56,35,189)

ఐర్లాండ్ – $271,731 (రూ. 2,49,98,298)

ఇటలీ – $256,154 (రూ. 2,35,62,748)

నెదర్లాండ్స్ – $256,154 (రూ. 2,35,62,748)

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – $256,154 (రూ. 2,35,62,748)

నేపాల్ – $256,154 (రూ. 2,35,62,748)

కెనడా – $225,000 (రూ. 2,06,92,575)

నమీబియా – $225,000 (రూ. 2,06,92,575)

ఒమన్ – $225,000 (రూ. 2,06,92,575)

Next Story