కసితో కొడుతున్న పృథ్వీ షా

Prithvi shaw's magic continues as Mumbai enters final beating Karnataka. పృథ్వీ షా.. చిన్న వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించాడు.

By Medi Samrat
Published on : 11 March 2021 7:49 PM IST

Prithvi shaw’s

పృథ్వీ షా.. చిన్న వయసులోనే భారత జట్టులో స్థానం సంపాదించాడు. మరో సచిన్ టెండూల్కర్ వచ్చాడంటూ అతడి ఆటను చూసి ఎంతో మంది మురిసిపోయారు. కానీ ఆస్ట్రేలియా సిరీస్ కు వెళ్లిన పృథ్వీ షా ఘోరంగా విఫలమవ్వడంతో విపరీతమైన విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు పృథ్వీ షా తన ఆటతీరుతోనే సమాధానం చెబుతూ ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఇప్పటికే డబుల్ సెంచరీతో ఇరగదీసిన షా.. మరో సెంచరీ సాధించాడు. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు బాదిన పృథ్వీ నేడు మరో సెంచరీ బాదేశాడు. నాలుగు సెంచరీల్లో మూడుసార్లు 150కి పైగా స్కోరు నమోదు చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో 227 నాటౌట్‌, 185 ప‌రుగులు నాటౌట్‌తో చెలరేగాడు. క‌ర్ణాట‌క‌తో జ‌రుగుతున్న సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో కేవ‌లం 122 బంతుల్లో 167 ప‌రుగులు చేశాడు. అత‌ని ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, 7 సిక్స‌ర్లు ఉన్నాయి. 79 బంతుల్లోనే సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. విజ‌య్ హజారే ట్రోఫీ ఒక సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్‌గా రికార్డు సృష్టించాడు.

ఇప్ప‌టికే టోర్నీలో 725 ప‌రుగులు చేసిన పృథ్వీ.. 723 ప‌రుగుల‌తో మ‌యాంక్ అగ‌ర్వాల్ పేరిట ఉన్న రికార్డును తాజాగా బ‌ద్ధ‌లుకొట్టాడు. కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై 49.2 ఓవర్లలో 322 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన కర్ణాటక 250 పరుగులకు ఆలౌట్ అయి 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ముంబై ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్ లో ఉత్తర ప్రదేశ్ తో ముంబై జట్టు తలపడనుంది. ఇక ఆ మ్యాచ్ లో పృథ్వీ షా ఎన్ని పరుగులు సాధిస్తాడో చూడాలి.




Next Story