పృథ్వీ షాను కొనలేదు.. అదే శాపమైందా.?

ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రౌండ్‌లో భారత బ్యాటర్ పృథ్వీ షా అమ్ముడుపోలేదు.

By Medi Samrat  Published on  25 Nov 2024 5:49 PM IST
పృథ్వీ షాను కొనలేదు.. అదే శాపమైందా.?

ఐపీఎల్ 2025 మెగా వేలం తొలి రౌండ్‌లో భారత బ్యాటర్ పృథ్వీ షా అమ్ముడుపోలేదు. IPL వేలం 2 వ రోజు కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్, శార్దూల్ ఠాకూర్ వంటి చాలా మంది స్టార్ ప్లేయర్‌లు మొదటి రౌండ్‌లో అమ్ముడుపోలేదు. పృథ్వీ షా తన బేస్ ధరను రూ.75 లక్షలుగా నిర్ణయించారు. అయితే నవంబర్ 25, సోమవారం జెడ్డాలో జరిగిన మెగా వేలంలో ఎటువంటి బిడ్‌లను ఆకర్షించడంలో విఫలమయ్యాడు.

ఒకప్పుడు భారత క్రికెట్ ఆశాకిరణంగా పరిగణించిన పృథ్వీ షా ఎటువంటి బిడ్‌లను పొందలేకపోయాడు. వేలం ఇంకా ముగియకపోవడంతో, షా IPL భవిష్యత్తుపై ఈరోజు రాత్రికి ఓ అంచనా రానుంది. షా కు ఐపీఎల్ లో అవకాశం రాకపోతే పృథ్వీ షా తన దృష్టిని దేశీయ క్రికెట్‌పై మళ్లించాలి. అతని ఫామ్, ప్రదర్శన, ఫిట్నెస్ పై పృథ్వీ షా పని చేయాలి.

షాను 2018లో, ICC పురుషుల క్రికెట్‌లో బ్రేక్‌అవుట్ స్టార్‌లలో ఒకరిగా గుర్తించింది. అయితే, 2019లో BCCI డోపింగ్ నిషేధం విధించడంతో అతని కెరీర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. అదే ఏడాది నవంబర్ వరకు అతన్ని పక్కన పెట్టింది. అక్కడి నుండి అతడు తిరిగి భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు.

Next Story