పృథ్వీ షా గోవాకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

Prithvi Shaw Stopped On Way To Goa For Travelling Without E-Pass. భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువవుతూ ఉండడంతో చాలా రాష్ట్రాలు

By Medi Samrat  Published on  14 May 2021 3:16 PM GMT
పృథ్వీ షా గోవాకు వెళ్తుండగా అడ్డుకున్న పోలీసులు

భారతదేశంలో కరోనా కేసులు ఎక్కువవుతూ ఉండడంతో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ ను అమలు చేస్తూ ఉన్నాయి. కేవలం కొన్నిటికి మాత్రమే మినహాయింపు ఇచ్చారు. రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు జరగాలంటే మాత్రం ఈ-పాస్ లు ఉండాలని అధికారులు చెప్పారు. ఈ-పాస్ లు లేకుండా వెళుతున్న వారిని ఎక్కడికక్కడ అడ్డుకుంటూ ఉన్నారు. తాజాగా భారత క్రికెటర్ పృథ్వీ షాను పోలీసులు అడ్డుకున్నారు.

గోవాకు వెళుతున్న పృథ్వీ షాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించిన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాను పోలీసులు ఆపేసారు. ముంబయి నుంచి గోవా వెళుతున్న పృథ్వీ షాను మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో పోలీసులు ఆపారు. పృథ్వీ షా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కారులో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు. పృథ్వీ షా అవసరమైన సమాచారం అందించి, ఈ-పాస్ టోకెన్ పొందడంతో పోలీసులు అతడిని గోవా వెళ్లేందుకు అనుమతించారు. ఐపీఎల్ ఆగిపోవడంతో పృథ్వీ షా తన స్వస్థలం ముంబయి చేరుకున్నాడు. అక్కడి నుండి గోవాకు వెళ్లాలని పృథ్వీ షా అనుకోగా.. ఇలా పోలీసులు అడ్డుకున్నారు.

ఇక ఎంతో ట్యాలెంట్ ఉన్న పృథ్వీ షా గతంలో కూడా ఎన్నో వివాదాల్లో చిక్కుకున్నాడు. ఇక కాస్త బరువు తగ్గితేనే భారత జట్టులో ఛాన్స్ ఉంటుందని బీసీసీఐ ఇటీవలే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఐపీఎల్ లో పృథ్వీ షా మంచి ఇన్నింగ్స్ లు ఆడాడు. ఒకే ఓవర్ లో ఆరు ఫోర్లు కొట్టి క్రికెట్ అభిమానులను అబ్బురపరిచాడు పృథ్వీ షా.


Next Story