పృథ్వీ షా తిరిగి ఐపీఎల్ లోకి వచ్చేశాడు. ఢిల్లీ కేపిటల్స్ జట్టు పృథ్వీకి మరో అవకాశం ఇచ్చింది. 26 ఏళ్ల మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ పృథ్వీ షాను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ-వేలంలో 75 లక్షల రూపాయలకు అమ్ముడయ్యారు. అబుదాబిలోని ఎతిహాద్ అరీనాలో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ పృథ్వీ షాను కొనుగోలు చేసింది. మొదట్లో అమ్ముడుపోని పృథ్వీ షా ఎట్టకేలకు వేలంలో ఢిల్లీకి సొంతమయ్యాడు.
అన్‌క్యాప్డ్ ఆల్‌రౌండర్ ఆకిబ్ దార్‌ను ఢిల్లీ రూ.8.40 కోట్లకు సొంతం చేసుకుంది. స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.7.2 కోట్లకు సొంతం చేసుకుంది. ప్రశాంత్ సోలంకి, కార్తిక్ త్యాగిలను కేకేఆర్ జట్టు రూ.30 లక్షల చొప్పున, సుశాంత్ మిశ్రాను రాజస్థాన్ రూ.90 లక్షలకు, నమన్ తివారిని లక్నో రూ.1 కోటికి సొంతం చేసుకున్నాయి.