పృథ్వీ వద్దు రాహుల్ ముద్దు.. దాదా రక్షించు
Prithvi Shaw over KL Rahul for now. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది.
By Medi Samrat Published on 21 Dec 2020 4:10 AM GMTఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. భారత టెస్టు చరిత్రలోనే అత్యల్ప సోరు (36) ను నమోదు చేసింది. దీంతో భారత జట్టుపై నలువైపుల నుంచి విమర్శలు మొదలయ్యాయి. అయితే.. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఓటమి తాలుకూ జ్ఞాపకాలను చెరిపివేసి.. రెండో టెస్టులో బలంగా పుంజుకోవాలని భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అన్నాడు. లేకుంటే వైట్ వాష్ తప్పదని హెచ్చరించాడు.
భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్నాడు. పుల్‌ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా ఆడించాలని.. పృథ్వీ షాను పక్కన పెట్టాలన్నాడు. ఇక శుభ్‌మన్ గిల్‌ను ఐదో స్థానంలో ఆడితే.. మంచి ఫలితాలు వస్తాయన్నాడు. ఓటమిపై ఆటగాళ్లను నిందించాల్సిన పనిలేదన్నాడు. ఆస్ట్రేలియా పేసర్లు చూపిన జోరుకు భారత జట్టే కాకుండా ఏ జట్టు అయినా ఇలానే చిత్తయ్యేదని అభిప్రాయపడ్డాడు. తొలి టెస్టులో లబుషేన్, టిమ్ పైన్ ఆదిలోనే వెనుదిరిగేవారని.. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు దాదాపు 120 పరుగుల ఆధిక్యం లభించేది. కానీ క్యాచ్‌లను జారవిడవడంతో ఆధిక్యం 50 పరుగులకే పరిమితమైందని తెలిపాడు. పాజిటివ్ థింకింగ్‌తో బరిలోకి దిగితే టీమ్ఇండియా తప్పక రాణిస్తుందని పేర్కొన్నాడు.
తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన మహ్మద్ షమీ గురించి గవాస్కర్ మాట్లాడుతూ.. గాయంతో షమి దూరం కావడం భారత్‌కు ఎదురుదెబ్బేనని చెప్పాడు. అతను బౌన్సర్లు, యార్కర్లతో ప్రత్యర్థులను కట్టడి చేయగలడన్నాడు. ఇషాంత్ శర్మ ఫిట్‌గా ఉంటే వెంటనే అతన్ని ఆస్ట్రేలియాకు పంపించాలని సూచించాడు. అలాగే టీమ్ఇండియా బ్యాకప్ ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాలని.. నవదీప్ సైనీ మంచి బౌలరే. కానీ వార్మప్ మ్యాచ్‌లో అతని బౌలింగ్ తీరుని చూస్తే ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేడనిపిస్తోంది అని గవాస్కర్ చెప్పాడు. ఇక ఇరు జట్ల మధ్య మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26న రెండో టెస్టు జరగనుంది.
దాదా రక్షించు..
టీమ్ఇండియా చెత్త ప్రదర్శనకు కారణం కోచ్ రవిశాస్త్రేనని నెటీజన్లు ఆరోపిస్తున్నారు. వెంటనే అతడిని కోచ్‌గా తొలగించి రాహుల్ ద్రావిడ్ లేదా అలాంటి వ్యక్తులకు బాధ్యతలు అప్పగించాలని సూచిస్తున్నారు. దయచేసి భారత క్రికెట్‌ను రక్షించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని అభ్యర్థిస్తున్నారు.