కామన్వెల్త్ క్రీడలు 2022లో భాగంగా మహిళల ఫ్రీస్టైల్ 50 కేజీల విభాగంలో కాంస్యం సాధించిన రెజ్లర్ పూజా గెహ్లాట్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. "పూజా, మీ పతకం వేడుకలకు పిలుపునిస్తుంది, క్షమాపణ కాదు. మీ జీవిత ప్రయాణం మమ్మల్ని ప్రేరేపిస్తుంది.. మీ విజయం మమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు భవిష్యత్తులో కూడా గొప్ప విషయాలలో ఉదాహారణగా ఉంటారు. ప్రకాశవంతంగా ఉండండి! అంటూ మోదీ ట్వీట్ చేశారు.
మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్‌లో పూజా గెహ్లాట్ కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతరం భావోద్వేగానికి గురయ్యారు. సెమీ ఫైనల్ చేరి ఓడిపోయాను. నేను నా దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.. ఇక్కడ జాతీయ గీతం వినిపించాలనేది నా కోరిక.. అయితే...'' అంటూ.. ''నా తప్పుల నుంచి నేర్చుకుంటాను. వాటిపై పని చేస్తాను" అని పూజా గెహ్లాట్ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ పూజా గెహ్లాట్‌కు సోషల్ మీడియా వేదికగా ప్రోత్సాహాన్ని అందించారు.