భారతదేశానికి చెందిన పారిస్ పారాలింపిక్స్ హీరోలతో సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పారాలింపియన్‌లకు న్యూఢిల్లీలోని తన నివాసంలో ప్రధాని మోదీ ఆతిథ్యం ఇచ్చారు. క్రీడలలో వారు సాధించిన చారిత్రక విజయాలను అభినందించారు. జావెలిన్ గోల్డ్ మెడలిస్ట్ నవదీప్ సింగ్‌తో హృదయపూర్వక సంభాషణ సందర్భంగా అతడు బహుమతిగా ఇచ్చిన టోపీని పెట్టుకోడానికి ప్రధాని నేలపై కూర్చున్నారు. ఈ భేటీలో ప్రధాని మోదీ, నవదీప్‌లు చాలా విషయాలను చర్చించారు.
నవదీప్ సింగ్ 47.32 మీటర్ల త్రో ద్వారా కొత్త వ్యక్తిగత రికార్డును సాధించడమే కాకుండా.. భారతదేశానికి ఏడో స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఢిల్లీకి చెందిన నవదీప్ పారిస్‌లో రికార్డు త్రో విసిరిన తర్వాత తన భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోయాడు. అతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.