నేడు ప్రధాని మోదీతో భారత మహిళల క్రికెట్ జట్టు భేటీ!
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది.
By - అంజి |
నేడు ప్రధాని మోదీతో భారత మహిళల క్రికెట్ జట్టు భేటీ!
వన్డే వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకున్న హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకుంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జట్టు భేటీ కానున్నట్లు సమాచారం. నవీ ముంబైలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం సాధించి మహిళల ఐసీసీ వరల్డ్ కప్‌ను భారత జట్టు మొదటిసారి కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయం సందర్భంగా ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జట్టును సత్కరించనున్నారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత, ఆటగాళ్లు హోటల్‌కు వెళ్లారు. బుధవారం పీఎంతో సమావేశం అనంతరం ప్రతి ఒక్కరూ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లనున్నారు.
భారత జట్టు విజయం సాధించిన వెంటనే ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో స్పందిస్తూ అభినందనలు తెలిపారు. “అద్భుతమైన విజయం. టోర్నమెంట్ మొత్తంలో భారత జట్టు చూపిన జట్టు స్పూర్తి, ధైర్యసాహసాలు ప్రశంసనీయం. ఈ చారిత్రక విజయం భవిష్యత్ తరాలను క్రీడల్లో రాణించేలా ప్రేరేపిస్తుంది” అని పేర్కొన్నారు.
ప్రత్యేక చార్టర్డ్ ఫ్లైట్‌లో ఢిల్లీకి..
జట్టు ముంబై నుండి Star Air నిర్వహించిన ప్రత్యేక చార్టర్ విమానం (S5-8328) ద్వారా ఢిల్లీకి చేరుకుంది. జట్టు చేరుకునే ముందు ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లు పెంచారు. జట్టు బస్సు మార్గాల్లో పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించగా, డాగ్ స్క్వాడ్‌ను కూడా వినియోగించారు. అంతకుముందు ముంబై విమానాశ్రయంలో జట్టు సభ్యులకు ఘన స్వాగతం లభించింది. అభిమానులు భారీగా చేరుకున్నారు.
ఫైనల్ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన
- భారత్ - 298 పరుగులు
- దక్షిణాఫ్రికా - 246 పరుగులు
- భారత్ 52 పరుగుల తేడాతో విజయం
దీప్తి శర్మ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శనతో నిలిచింది.58 పరుగులు, 4 వికెట్లు. షఫాలి వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి భారత స్కోరు భారీగా నిలిపింది. దక్షిణాఫ్రికా వైపు నుండి కెప్టెన్ లారా వోల్వార్డ్ (101) మాత్రమే పోరాడింది. ఆమెను దీప్తి శర్మ బౌలింగ్‌లో, అమన్‌జోత్ కౌర్ పట్టిన క్యాచ్‌తో ఔట్ చేశారు.