బాబర్‌కు అండ‌గా నిలిచిన ఫాస్ట్ బౌలర్

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది

By Medi Samrat  Published on  19 Oct 2024 3:49 PM IST
బాబర్‌కు అండ‌గా నిలిచిన ఫాస్ట్ బౌలర్

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు పాకిస్థాన్ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతుంది. సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. తదుపరి 2 టెస్టుల కోసం పాకిస్థాన్ జట్టులో మార్పులు చేసింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం, నసీమ్ షా, సర్ఫరాజ్ అహ్మద్, షాహీన్ షా ఆఫ్రిదిలకు జట్టులో చోటు దక్కలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్‌ విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో బాబర్ ఆజంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాబర్ వల్లనే జట్టు ఓటమి చవిచూస్తోందని సోషల్ మీడియాలో జనాలు అంటున్నారు. బాబర్ ఆజం కూడా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.

బాబర్ స్థానంలో పాకిస్థాన్ జట్టులో చోటు దక్కించుకున్న కమ్రాన్ గులామ్ అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించాడు. అటువంటి పరిస్థితిలో బాబర్‌పై విమర్శలు బాగా పెరిగాయి. అయితే.. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ అమీర్ బాబర్ ఆజంను సమర్థించాడు. బాబర్‌ను సమర్థిస్తూ అమీర్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు.

మెరుగైన ప్రణాళికతో ఆడాం. స్వదేశంలో ఆడడాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించాం. మీరు ప్రదర్శన ఆధారంగా మాట్లాడవచ్చు కానీ దయచేసి ఆటగాళ్లను వ్యక్తిగతంగా మాట్లాడకండి అని అమీర్ రాశాడు.

బాబర్ ఆజం గత కొంత కాలంగా పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఇటీవల కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి కూడా ఇదే కారణం. బాబర్ గత రెండేళ్లుగా టెస్టుల్లో ఫిఫ్టీ కూడా చేయలేదు. టెస్టులో చివరి సెంచరీ డిసెంబర్ 2022లో న్యూజిలాండ్‌పై చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన‌ తొలి టెస్టు మ్యాచ్‌లో బాబర్ అజామ్ తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్ర‌మే చేశాడు.

గతంలో బంగ్లాదేశ్‌ పాకిస్థాన్‌లో పర్యటించింది. ఈ సమయంలో ఇరు జట్ల మధ్య 2 టెస్టు మ్యాచ్‌లు జరిగాయి. బంగ్లాదేశ్ తొలిసారిగా పాకిస్థాన్‌ను ఓడించి సిరీస్‌ను గెలుచుకుంది.

Next Story