అబుదాబిలో భారత్‌కు చెందిన చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక ఒత్తిడితో ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మోహన్ సింగ్ గత 15 ఏళ్ల నుండి జాయెద్ క్రికెట్ స్టేడియంలో చీఫ్ క్యూరేటర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు మొహాలీ పిచ్ క్యూరేటర్ దల్జీత్ సింగ్ దగ్గర చాలా కాలం పాటు మోహన్ సింగ్ క్యూరేటర్‌గా విధులు నిర్వర్తించాడు. ఆ తర్వాత యూఏఈకి వెళ్లారు. ప్రపంచ టీ 20 వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్ - ఆప్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ జరగడానికి ముందే మోహన్ సింగ్ ఆత్మహత్యకు పాల్పడడం తీవ్రం కలకలం రేపింది.
మోహన్ సింగ్ వయస్సు 45 ఏళ్లు. ఆయన స్వస్థలం ఉత్తరాఖండ్. మార్నింగ్ టైమ్‌లో గ్రౌండ్‌కు వచ్చిన ఆయన పిచ్‌ను పర్యవేక్షించి తన రూమ్‌లోకి వెళ్లి మరీ ఎంతకీ తిరిగి రాలేదని యూఏఈ క్రికెట్ వర్గాలు తెలిపారు. గ్రౌండ్ సిబ్బంది రూమ్‌కు వెళ్లి చూడగా మోహన్ సింగ్ ఫ్యానుకు ఉరేసుకొని చనిపోయి కనిపించాడని అబుదాబి క్రికెట్ అధికారి ఒకరు చెప్పారు. చీఫ్ పిచ్ క్యూరేటర్ మోహన్ సింగ్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మోహన్ గత కొంత కాలంగా మానసిక కుంగుబాటులో ఉన్నట్లు తెలిసింది.