ఒకే దేశంపై మూడు టీ20 సెంచరీలు బాదాడు.. కేకేఆర్ టీమ్ ఓపెనర్ తను..!
ఫిల్ సాల్ట్ టీ20లో మూడో చారిత్రాత్మక సెంచరీ సాధించాడు.
By Kalasani Durgapraveen Published on 10 Nov 2024 3:45 PM ISTఫిల్ సాల్ట్ టీ20లో మూడో చారిత్రాత్మక సెంచరీ సాధించాడు. దాని సహాయంతో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్‌లో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లోని మొదటి T20Iలో ఇంగ్లాండ్ ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. ఫిల్ సాల్ట్ వెస్టిండీస్‌పై తన మూడు సెంచరీలను సాధించాడు. అలా చేసిన ప్రపంచంలోనే తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
వెస్టిండీస్‌పై ఫిల్ సాల్ట్ T20I సెంచరీల వివరాలు..
109 నాటౌట్ - vs వెస్టిండీస్ - సెయింట్ జార్జ్ - 2023
119 - vs వెస్టిండీస్ - తరుబా - 2023
103 నాటౌట్ - vs వెస్టిండీస్ - బ్రిడ్జ్‌టౌన్ - 2024
టీ20లో ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్
3 సెంచరీలు - ఫిల్ సాల్ట్(ఇంగ్లాండ్) - vs వెస్టిండీస్
2 సెంచరీలు - లెస్లీ డన్‌బార్(సెర్బియా) - vs బల్గేరియా
2 సెంచరీలు - ఎవిన్ లూయిస్(వెస్టిండీస్) vs భారత్
2 సెంచరీలు - గ్లెన్ మాక్స్‌వెల్(ఆస్ట్రేలియా) - vs భారత్
2 సెంచరీలు - ముహమ్మద్ వాసిమ్(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) - vs ఐర్లాండ్
ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఆతిథ్య జట్టు ఆరంభం చాలా దారుణంగా ఉంది. మూడు పరుగులు చేసిన తర్వాత బ్రాండన్ కింగ్ ఔటయ్యాడు. ఎవిన్ లూయిస్ కూడా 13 పరుగులు చేసిన తర్వాత నిష్క్రమించాడు. నికోలస్ పూరన్ బ్యాట్‌లో 38 పరుగులు చేవాడు. హెట్మెయర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆండ్రీ రస్సెల్ 30 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రొమారియో షెపర్డ్ 22 బంతుల్లో 35 పరుగులతో అజేయంగా నిలిచాడు. స్పిన్నర్ గుడాకేష్ మోతీ 33 పరుగులతో క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ తరఫున సాకిబ్ మహమూద్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఆదిల్ రషీద్ 4 ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు.
183 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్‌కు ఫిల్ సాల్ట్ టాస్క్‌ను సులభతరం చేశాడు. మరో ఓపెనర్ విల్ జాక్వెస్ 17 పరుగులు చేసిన తర్వాత గుడాకేష్ మోతీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే షెపర్డ్ బంతికి మోతీకి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా సులువుగా విజయం సాధించింది. ఫిల్ సాల్ట్ 54 బంతుల్లో 103 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. జాకబ్ బెతెల్ 36 బంతుల్లో 58 పరుగులతో అజేయంగా నిలిచాడు.