టీం ఇండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ సంచలన ఆరోపణలు చేసారు. భారత స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలం కావాలని కొందరు సెలెక్టర్లు ఆశగా ఎదురుచూస్తున్నారని అన్నాడు. 2027 వన్డే వరల్డ్ కప్ నుంచి వారిని తొలగించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని, వీరిరువురూ జట్టు నుంచి తొలగించే అవకాశం వారికి ఇవ్వకూడదని అన్నారు. వరల్డ్ కప్ జరిగే సౌత్ ఆఫ్రికా పిచ్ లపై కోహ్లీకి, రోహిత్ కి ఎంతో అనుభవం ఉందని, వారిద్దరూ ఆ ట్రోఫీలో తప్పకుండా ఆడాలని కైఫ్ సూచించాడు.
మీరు కొత్త ఆటగాడిగా ఉన్నప్పుడు, ఎవరూ మీకు మద్దతు ఇవ్వరని తెలుసుకోవాలి, భారత జట్టులో కొనసాగడానికి మీరు మంచి ప్రదర్శన ఇవ్వాలి. ఇక కెరీర్ చివరిలో కూడా వారు అదే విధానం ఉంటుందన్నాడు కైఫ్. ఇక్కడ స్నేహితులు ఎవరూ ఉండరు, భారతదేశం తరపున ఆడుతున్నాను అనే విషయం మాత్రమే గుర్తు పెట్టుకోవాలని అన్నాడు కైఫ్.