టాప్-10 బ్యాట్స్‌మెన్‌లో షాహీన్ అఫ్రిదీ ఒకడు.. నోరు జారిన పీసీబీ చైర్మన్
PCB chief Zaka Ashraf makes comical error at Asia Cup 2023 event. ఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా తొలుత షెడ్యూల్‌ను
By Medi Samrat Published on 21 July 2023 9:49 AM GMTఆసియా కప్ 2023 షెడ్యూల్‌ను బుధవారం ప్రకటించారు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జే షా తొలుత షెడ్యూల్‌ను ప్రకటించారు. సబ్ కాంటినెంటల్ ఈవెంట్‌కు సహ-హోస్ట్ అయిన పీసీబీ షెడ్యూల్‌ను ప్రకటిస్తూ ఓపెనింగ్ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీబీ చైర్మన్ జాకా అష్రఫ్‌తో పాటు పలువురు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో అష్రఫ్ ఫన్నీ మిస్టేక్ చేశాడు. వన్డేలలో పాకిస్తాన్ సామర్ధ్యం గురించి మాట్లాడుతూ.. ఫాస్ట్ బౌలర్ షాహీన్ ఆఫ్రిదిని టాప్-10 బ్యాట్స్‌మెన్‌గా పేర్కొన్నాడు.
ఈ వేడుకలో జాకా అష్రఫ్ మాట్లాడుతూ.. “మాకు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బలం ఉంది. మా బ్యాటింగ్ గురించి మాట్లాడితే.. కెప్టెన్ బాబర్ అజామ్ ప్రపంచంలోనే నంబర్-1 బ్యాట్స్‌మెన్. ఇతర బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడినట్లయితే.. కొంతమంది బ్యాట్స్‌మెన్‌లు టాప్-5లో ఉన్నారు. షాహీన్ ఆఫ్రిది.. టాప్-10 బ్యాట్స్‌మెన్‌లో ఉన్నాడు. పాకిస్థాన్ జట్టు ఆడుతున్న తీరుకు వారికి శుభాకాంక్షలు తెలుపున్నానని వ్యాఖ్యానించాడు.
జకా అష్రఫ్ మాట్లాడిన వీడియో పీసీబీ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉంది. అయితే ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ నంబర్-1లో కొనసాగుతున్నాడు. ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్ ర్యాంకింగ్స్ పట్టికలో మూడు,నాలుగు స్థానాలలో ఉన్నారు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వన్డేల్లో బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 9వ స్థానంలో ఉన్నాడు. షాహీన్ బ్యాట్స్‌మెన్‌లలో టాప్-10కి సమీపంలో ఎక్కడా లేడు.
ఈసారి ఆసియా కప్ హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. టోర్నీలో భాగంగా ముల్తాన్‌లో పాకిస్థాన్, నేపాల్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ సెప్టెంబర్ 2న శ్రీలంకలోని క్యాండీలో జరగనుంది. సెప్టెంబరు 4న ఇదే వేదికపై భారత జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను నేపాల్‌తో ఆడనుంది. ఆసియా కప్‌లో మూడు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు, ఒక సూపర్ ఫోర్ స్టేజ్ మ్యాచ్‌లకు పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీ మిగతా మ్యాచ్‌లు శ్రీలంకలో జరుగుతాయి. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17న కొలంబోలో జరగనుంది.