PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ ప‌రిస్థితేంటి.?

IPL 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది.

By Medi Samrat
Published on : 28 May 2025 6:28 PM IST

PBKS vs RCB : వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే ఆర్బీబీ ప‌రిస్థితేంటి.?

IPL 2025 క్వాలిఫయర్-1 మ్యాచ్ గురువారం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్‌, ఆర్‌సీబీ ప్లేఆఫ్‌కు అర్హత సాధించాయి. మొదటి రెండు జట్లకు ఫైనల్స్‌కు చేరుకోవడానికి రెండు అవకాశాలు లభిస్తాయి. పంజాబ్, RCB దీన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నాయి.

2014 తర్వాత పంజాబ్ కింగ్స్ తొలిసారి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. జట్టు అప‌జ‌యాల సంస్కృతిని మార్చి కొత్త రూపాన్ని అందించిన ఘ‌న‌త శ్రేయ‌స్‌ అయ్యర్, ప్రధాన కోచ్ రికీ పాంటింగ్‌లకే ద‌క్కుతుంది. మరోవైపు నాకౌట్ దశలో పలు పరాజయాలను ఎదుర్కొన్న ఆర్సీబీ ఈసారి టైటిల్ కరువుకు తెరదించాల‌ని భావిస్తోంది.

పంజాబ్‌కు ఆందోళన కలిగించేది బౌలింగ్ విభాగం.. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మార్కో యాన్సెన్ జాతీయ జట్టు కోసం ఆడటానికి స్వదేశానికి తిరిగివెళ్లాడు. పవర్‌ప్లే, డెత్ ఓవర్లలో యాన్సెన్ కీలకమైన ఓవర్లు బౌలింగ్ చేశాడు. దీంతో ఆ ఎఫెక్ట్ ఖ‌చ్చితంంగా జ‌ట్టు మీద ప‌డుతుంది. కైల్ జేమిసన్ అత‌డి స్థానంలో జ‌ట్టులోకి వ‌చ్చాడు. అతను ప్రభావం చూపలంటే మెరుగ్గా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ కూడా యాన్సెన్ స్థానంలోకి రావచ్చు.

టోర్నమెంట్ చివరి దశలో కొంతమంది ఆటగాళ్లకు గాయాలు కావడంతో RCB ఆందోళనలను కలిగి ఉంది. అయితే ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్ పూర్తి ఫిట్‌గా ఉంటాడని.. టిమ్ డేవిడ్ కూడా ఎంపికకు అందుబాటులో ఉంటాడని భావిస్తున్నారు. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ పంజాబ్ సొంత మైదానం కూడా అయిన ముల్లన్‌పూర్‌లో జరగనుంది. ఈ సీజన్‌లో కొన్ని మ్యాచ్‌లను వర్షం ప్రభావితం చేసింది, అయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ఇప్పుడు మ్యాచ్‌కి అదనపు గంట సమయం కేటాయించింది. తద్వారా వర్షం కురిస్తే మ్యాచ్ ఆగ‌దనే ఓ చిన్న‌ ఆశ ఉంది.

పంజాబ్, RCB మధ్య మ్యాచ్‌కు ఎటువంటి రిజర్వ్ డే లేదు. వర్షం కారణంగా మ్యాచ్ వాష్ అయితే.. అది పంజాబ్ కింగ్స్‌కు ప్రయోజనం చేకూరుస్తుంది. పంజాబ్ జట్టు గ్రూప్ దశలో మొదటి స్థానంలో నిలిచింది. వర్షం ఆటకు అంతరాయం కలిగించి, మ్యాచ్ రద్దు అయితే అది అగ్రస్థానంలో ఉండటం ద్వారా పంజాబ్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తుం. టైటిల్ మ్యాచ్‌కు చేరుకోవడానికి RCB క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గెలవాలి.

మ్యాచ్ జరిగే రోజు ముల్లన్‌పూర్‌లో వాతావరణం స్పష్టంగా ఉంటుందని భావిస్తున్నారు. వాతావరణ శాఖ ప్రకారం.. మ్యాచ్ స‌మ‌యంలో వర్షం కురిసే అవ‌కాశం ఒక శాతం, ఆకాశం మేఘావృతమయ్యే అవ‌కాశం 50 శాతం.. అయితే ఎలాంటి ఆటంకం లేకుండా మ్యాచ్ జరగాలని పంజాబ్, ఆర్సీబీతో పాటు క్రికెట్ అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

Next Story