టీమిండియా క్రికెటర్ పార్దీవ్ పటేల్(35) క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు సుదీర్ఘమైన సందేశాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నాడు. పార్థివ్ 2002లో ఇంగ్లాండ్‌తో ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన టెస్టు ద్వారా ఆరంగ్రేటం చేశాడు. అప్పుడు అతని వయస్సు 17 సంవత్సరాల 153 రోజులు. దీంతో అతి పిన్న వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన వికెట్ కీపర్‌గా పార్దీవ్ రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ క్రికెటర్ అనీప్ మహ్మద్ (17 సంవత్సరాల 300రోజులు) పేరిట ఈ రికార్డు ఉండేది.
పస్టు క్లాస్ క్రికెట్‌లో అదరగొట్టిన పార్దీవ్.. టీమిండియా తరుపున 25 టెస్టులు, 38 వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. వన్డేలలో 934 పరుగులు, టెస్టులలో 736 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, ఆర్‌సీబీ, కొచ్చి టస్కర్న్, చెన్నై సూపర్ కింగ్స్, దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ప్రాతినిధ్యం వహించాడు.