చెత్త ఆటతీరుతో పాకిస్థాన్ జట్టు మరోసారి అభాసుపాలైంది. చాంపియన్స్ ట్రోఫీ నుంచి లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ దారుణమైన ఆటతీరుతో విమర్శల పాలవుతోంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్రైస్ట్‌చర్చ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 91 పరుగులకే కుప్పకూలి టీ20ల్లో ఆ జట్టు తరపున అతి తక్కువ స్కోరు నమోదు చేసింది.
సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో ఆడుతున్న పాక్ తొలి మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన కనబరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌట్ అయింది. ఖుష్దిల్ 32 పరుగులతో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఇద్దరు డకౌట్ కాగా, ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీ20ల్లో 100 పరుగుల లోపు ఆలౌట్ కావడం పాక్‌కు ఇదే తొలిసారి. 2016 జనవరిలో వెల్లింగ్టన్‌లో కివీస్‌తోనే జరిగిన మ్యాచ్‌లో పాక్ 101 పరుగులు చేసింది. అనంతరం 92 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించింది . 10.1 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది.