IND vs PAK : హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఆడుతున్న ఆట‌గాళ్లు వీళ్లే..!

By Medi Samrat  Published on  23 Feb 2025 2:21 PM IST
IND vs PAK : హై వోల్టేజ్ మ్యాచ్‌లో ఆడుతున్న ఆట‌గాళ్లు వీళ్లే..!

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19న ప్రారంభమైంది. ఈరోజు టోర్నీలోనే హై వోల్టేజ్ మ్యాచ్ ఐన‌టువంటి భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ దుబాయ్ మైదానంలో జ‌రుగుతుంది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్లో భారత్‌పై పాకిస్థాన్ విజయం సాధించింది. దీంతో ఈ రోజు భారత జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని భావిస్తోంది.

భారత జట్టు తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. మరొక విజయం సాధిస్తే భారత్‌కు సెమీ-ఫైనల్‌కు టికెట్ క‌న్ఫ‌ర్మ్ అవుతుంది. మరోవైపు గ‌త మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై న్యూజిలాండ్‌ విజయం సాధించింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు పాకిస్థాన్ ఓడిపోతే తర్వాతి రౌండ్‌కు చేరుకోవడం కష్టమే.

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(w/c), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్. ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్(w/c), సల్మాన్ అఘా, తయ్యబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.

Next Story