పాకిస్థాన్‌కు ప‌రువు ద‌క్కించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందే..!

పాకిస్థాన్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఏ మాత్రం కలిసి రాలేదు. గ్రూప్ స్టేజీలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్థాన్ జట్టు.

By Medi Samrat  Published on  27 Feb 2025 4:26 PM IST
పాకిస్థాన్‌కు ప‌రువు ద‌క్కించుకునే అవకాశం కూడా లేకుండా పోయిందే..!

పాకిస్థాన్ జట్టుకు ఛాంపియన్స్ ట్రోఫీ ఏ మాత్రం కలిసి రాలేదు. గ్రూప్ స్టేజీలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయి టోర్నమెంట్ నుండి వైదొలిగిన పాకిస్థాన్ జట్టు. కనీసం ఆఖరి లీగ్ మ్యాచ్ లో అయినా విజయం సాధించాలని అనుకుంది. అయితే వర్షం కారణంగా బంగ్లాదేశ్ తో జరగాల్సిన మ్యాచ్ టాస్ కూడా పడకుండానే రద్దయింది.

రావల్పిండిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ చూడడానికి వచ్చిన జనం గొడుగుల కిందే కొన్ని గంటల పాటూ కూర్చున్నారు. గ్రౌండ్ లో ఎక్కడ చూసినా నీరు ఉండడంతో మ్యాచ్ ను ఆరంభించే అవకాశం అసలు దక్కలేదు. బంగ్లాదేశ్ జట్టు కూడా టోర్నమెంట్ నుండి ఇప్పటికే ఎలిమినేట్ అవ్వడంతో మ్యాచ్ కు ఎలాంటి ప్రాధాన్యత కూడా లేకుండా పోయింది. దీంతో చెరో పాయింట్ తీసుకుని రెండు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నుండి నిష్క్రమించాయి. ఆఖరి మ్యాచ్ లో స్వదేశంలోని ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అనుకున్న పాక్ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు.

Next Story