ఇండియన్ ప్రీమియర్ లీగ్ తో పోటీ పడడానికి పాకిస్థాన్ సూపర్ లీగ్ సిద్ధమైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025లో మొదటి మ్యాచ్‌లో షాదాబ్ ఖాన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామాబాద్ యునైటెడ్, షాహీన్ షా అఫ్రిదికి చెందిన లాహోర్ ఖలందర్స్ తలపడనున్నారు. ఏప్రిల్ 11, శుక్రవారం జరగనున్న ఈ మ్యాచ్‌కు రావల్పిండి క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది.
కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగిన గత సీజన్ ఫైనల్‌లో ముల్తాన్ సుల్తాన్స్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత ఇస్లామాబాద్ యునైటెడ్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ సీజన్‌లో కూడా సత్తా చాటాలని, వరుసగా టైటిళ్లను గెలుచుకోవాలని చూస్తోంది. ఇస్లామాబాద్ యునైటెడ్ vs లాహోర్ ఖలందర్స్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9:00 గంటలకు ప్రారంభమవుతుంది. ఏ భారత టెలివిజన్ ఛానల్ లోనూ ప్రత్యక్ష ప్రసారం లేదు. అయితే ఫ్యాన్‌కోడ్ యాప్‌లో అందుబాటులో ఉంటుంది.