జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన దారుణ ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై పలు చర్యలు తీసుకుంది. తాజాగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాన్ని భారతదేశంలో నిషేధించాయి. ఈ నివేదికల ప్రకారం, PSL అధికారిక డిజిటల్ ప్రసార సంస్థ FANCODE, PSL మ్యాచ్‌ల ప్రసారాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలోని క్రికెట్ అభిమానులు పీఎస్ఎల్ మ్యాచ్ లు చూడటానికి యాక్సెస్ ఉండదు.
ఏప్రిల్ 24 నుండి భారతదేశంలో జరుగుతున్న క్రికెట్ సూపర్ లీగ్‌ను ప్రసారం చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ఫ్యాన్‌కోడ్ ప్రకటించింది. ఈ నిర్ణయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు గణనీయమైన ఆర్థిక నష్టాలను కలిగిస్తుంది. ప్రస్తుతం, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) భారతదేశంలో జరుగుతుండగా, సూపర్ లీగ్ పాకిస్తాన్‌లో జరుగుతోంది. PSL ఏప్రిల్ 11న ప్రారంభమైంది. దాని అన్ని మ్యాచ్‌లు OTT ప్లాట్‌ఫారమ్ FANCODEలో అందుబాటులో ఉన్నాయి.