పాకిస్థాన్ ఫెడరల్ మినిస్టర్ అటా తరార్ ఐసీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రెండు రోజుల క్రితం పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ముగ్గురు యువ క్రికెటర్లు చెందగా, వారి మృతికి ఐసీసీ సంతాపం తెలిపింది. BCCI కూడా దాడిని ఖండించింది. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు వచ్చే నెలలో జరుగనున్న శ్రీలంక, పాకిస్తాన్‌లతో జరిగే ముక్కోణపు సిరీస్ నుండి వైదొలిగింది.
ఆఫ్ఘన్ క్రికెటర్ల మరణానికి సంబంధించి ఐసిసి, బిసిసిఐ చేసిన ప్రకటన పాకిస్తాన్‌కు నచ్చలేదు. తామే సంవత్సరాలుగా ఉగ్రవాద బాధితులుగా ఉన్నామని పేర్కొంది. అటా తరార్ ఆదివారం ఒక ప్రకటనలో ఇలా అన్నారు: “పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడిలో ఆఫ్ఘన్ క్రికెటర్లు మరణించారని ICC చేసిన ప్రకటనను మేము తిరస్కరించాము. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన వాదనను ధృవీకరించకుండానే ఐసిసి ఆరోపణలు చేస్తోంది. దాడి పాకిస్తాన్ చేసిందని పేర్కొంది. ఏళ్ల తరబడి తమ దేశమే ఉగ్రవాదంతో బాధపడుతోంది. ఐసీసీ విడుదల చేసిన ప్రకటన తర్వాత ఐసీసీ చైర్మన్ జే షా కూడా అదే మాటలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అదే మాటను అనుసరించింది. ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రకటన ఇచ్చింది. ఐసీసీ పాకిస్థాన్ పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని.. అంతర్జాతీయ సంస్థ ధృవీకరణ లేకుండా దావాలు చేయకూడదని అట తరార్ అన్నాడు