బోర్డుతో ఒప్పందాన్ని రద్దు చేసుకునే యోచనలో పాక్ క్రికెటర్లు..!
పాక్ క్రికెట్ టీమ్‌లో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఫారిన్ లీగ్ ఆడాలనుకుంటున్నారు.
By Medi Samrat Published on 5 Feb 2024 3:00 PM ISTపాక్ క్రికెట్ టీమ్‌లో గందరగోళం నెలకొంది. పాకిస్తాన్ ఆటగాళ్ళు ఫారిన్ లీగ్ ఆడాలనుకుంటున్నారు. దీని కోసం వారు బోర్డు నుండి NOCని అడిగారు. అయితే పాకిస్తాన్ బోర్డు NOC ఇవ్వడానికి స్పష్టంగా నిరాకరించింది. పాకిస్థాన్ సూపర్ లీగ్‌పై పాక్ ఆటగాళ్లు దృష్టి సారించాలని.. తమ దేశం తరఫున ఆడాలని బోర్డు చెబుతోంది. ఈ కారణంతో బోర్డు ఎన్‌ఓసీ ఇచ్చేందుకు నిరాకరించింది. అటువంటి పరిస్థితితులలో, పాక్ ఆటగాళ్లు బోర్డుతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు.
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కానుంది. పాకిస్తాన్‌లోని స్టార్ ఆటగాళ్లందరూ PSL ఆడాలని బోర్డు కోరుకుంటోంది. ఈ కారణంగా ఎన్‌ఓసి డిమాండ్‌ను బోర్డు అంగీకరించలేదు. మరోవైపు ఆటగాళ్లు మాత్రం బీపీఎల్, ఐఎల్‌టీ20 లీగ్ ఆడుతామని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. దీని కోసం ఆటగాళ్లకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి NOC అవసరం.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న ఈ నిర్ణయంపై ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో పాకిస్తాన్‌కు చెందిన కొంతమంది పెద్ద ఆటగాళ్లు కూడా బోర్డుతో జాతీయ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ వివాదంపై నిన్న పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ కూడా వివరణ ఇచ్చాడు. అతడు పాకిస్తాన్ ఆటగాళ్లకు మద్దతు ఇచ్చాడు. వారు తప్పనిసరిగా NOC పొందాలని అన్నారు. బయట లీగ్‌లు ఆడటం ద్వారా ఆటగాళ్లకు డబ్బు సంపాదించే అవకాశం లభిస్తే.. వారు తప్పనిసరిగా NOC పొందాలన్నారు. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం ఆటగాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.