తండ్రి చనిపోయారు.. ఇంటికి వెళ్లిన కెప్టెన్

పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి బయటకు వచ్చేసింది

By Medi Samrat  Published on  10 Oct 2024 4:22 PM IST
తండ్రి చనిపోయారు.. ఇంటికి వెళ్లిన కెప్టెన్

పాకిస్థాన్ మహిళా జట్టు కెప్టెన్ ఫాతిమా టీ20 ప్రపంచ కప్ జట్టు నుండి బయటకు వచ్చేసింది. సనా తండ్రి మరణ వార్త తెలుసుకున్న తర్వాత కరాచీకి తిరిగి ప్రయాణమైందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. శుక్రవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాకిస్థాన్ తలపడాల్సి ఉండగా, ఫాతిమా ఆ మ్యాచ్‌కు దూరమవుతుంది. ఆమె గైర్హాజరీలో, వికెట్ కీపర్-బ్యాటర్ మునీబా అలీ పాకిస్థాన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది.

సెమీ-ఫైనల్‌కు అర్హత సాధించడానికి తమ మిగిలిన గ్రూప్ A రెండింటినీ గెలవాల్సిన పాకిస్తాన్‌కు ఫాతిమా జట్టులో లేకపోవడం పెద్ద దెబ్బ. శ్రీలంకపై గెలిచి భారత్‌తో ఓడిన పాకిస్థాన్ ప్రస్తుతం గ్రూప్-ఎలో మూడో స్థానంలో ఉంది.

Next Story