34 ఏళ్ల‌కే అన్ని ఫార్మ‌ట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌రౌండ‌ర్‌..!

పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

By Medi Samrat  Published on  25 Nov 2023 11:52 AM IST
34 ఏళ్ల‌కే అన్ని ఫార్మ‌ట్‌ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆల్‌రౌండ‌ర్‌..!

పాకిస్థాన్ ఆల్ రౌండర్ ఇమాద్ వసీం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల ఇమాద్ అన్ని ఫార్మ‌ట్‌ల‌ క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇమాద్ చాలా కాలంగా పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఇమాద్ తన చివరి వ‌న్డే నవంబర్ 2020లో జింబాబ్వేపై ఆడాడు. 2023 ఏప్రిల్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో చివరిసారిగా పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇమాద్ వసీం తన కెరీర్‌లో 55 వన్డేలు, 66 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. మొత్తం 109 వికెట్లు తీసి 1,472 పరుగులు చేశాడు.

రిటైరయ్యేందుకు ఇదే సరైన సమయమని భావిస్తున్నానని ఇమాద్ సోషల్ మీడియా ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇటీవలి కాలంలో నా అంతర్జాతీయ కెరీర్ గురించి చాలా ఆలోచిస్తున్నానని, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేందుకు ఇదే సరైన సమయమనే నిర్ణయానికి వచ్చానని చెప్పాడు. పిసిబి అందించిన మద్దతుకు నేను ధన్యవాదాలు. పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వకారణం. వన్డే, టీ20ల్లో నేను ఆడిన 121 మ్యాచ్‌ల ద్వారా నా ప్రతి ఒక్క కల నిజమైంది అని పోస్ట్‌లో రాశాడు. కొత్త కోచ్, నాయకత్వం రాక పాకిస్థాన్ క్రికెట్‌కు మంచి సమయం. అందరికీ జట్టులో అవకాశం రావాలని కోరుకుంటున్నాను. జట్టు అద్భుతంగా రాణిస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. తన కెరీర్‌లో తనకు మద్దతుగా నిలిచిన పాక్ అభిమానులతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు కృతజ్ఞతలు. నా కెరీర్‌లో ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీ సపోర్ట్ చాలా ముఖ్యమైంది. నేను ఇప్పుడు నా కెరీర్ తదుపరి దశపై దృష్టి పెట్టాలని ఎదురుచూస్తున్నానని పేర్కొన్నాడు.

Next Story