Champions Trophy-2025 : పాకిస్థాన్‌కు పరువు కాపాడుకునే అవకాశం కూడా దక్కేలా లేదు..!
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ జట్టు తన మొదటి రెండు మ్యాచ్‌లలో వరుస ఓటములు చవిచూసింది.
By Medi Samrat
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ జట్టు తన మొదటి రెండు మ్యాచ్‌లలో వరుస ఓటములు చవిచూసింది. న్యూజిలాండ్, భారత్‌లపై ఓడిన పాకిస్థాన్ జట్టు దాదాపు టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే.. ఫిబ్రవరి 27న బంగ్లాదేశ్‌తో పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు ముందు రావల్పిండి వాతావరణం భయానకంగా ఉంది. అయితే పరువు కాపాడుకునేందుకు పాకిస్థాన్‌కు ఇదే చివరి అవకాశం. అయితే మ్యాచ్ సమయంలో వాతావరణం మారే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.
రావల్పిండి ఫ్లాట్ పిచ్ బౌలర్లకు అంతగా కలిసిరాదు. ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ పరుగులు భారీగా చేయడం కనిపిస్తుంది. ఫాస్ట్ బౌలర్లు ప్రారంభంలో కొంత పేస్‌ను పొందవచ్చు.. కానీ మ్యాచ్ పురోగమిస్తున్న కొద్దీ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారుతుంది. మధ్యలో స్పిన్నర్లు కూడా అనుకూలించే అవకాశం ఉంది. అయితే.. ఈ మ్యాచ్‌లో వర్షం కురిసే అవకాశం ఉంది.
రావల్పిండి స్టేడియంలో ప్రస్తుత టోర్నీలో ఇది రెండో మ్యాచ్. అంతకుముందు బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య లో స్కోరింగ్ మ్యాచ్ జరిగింది. అయితే నిన్న ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా మ్యాచ్ ఈ మైదానంలో జరగాల్సి ఉంది.. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌లో టాస్ కూడా పడలేదు.
ఫిబ్రవరి 27న రావల్పిండి వాతావరణం చల్లగా ఉండబోతోంది. పాకిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం ఉంది. ఉష్ణోగ్రత 12 డిగ్రీల నుండి 17 డిగ్రీల వరకు ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
బంగ్లాదేశ్-
తంజీద్ హసన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), మెహదీ హసన్ మిరాజ్, తౌహీద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), మహ్మదుల్లా, జాకర్ అలీ, రిషద్ హొస్సేన్, తస్కిన్ అహ్మద్, నహిద్ రానా మరియు ముస్తాఫిజుర్ రహ్మాన్.
పాకిస్థాన్-
ఇమామ్ ఉల్ హక్, బాబర్ అజామ్, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్/కెప్టెన్), అఘా సల్మాన్, తైబ్ తాహిర్, ఖుష్దిల్ షా, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.