పారాలింపిక్స్‌లో భవీనా కొత్త చరిత్ర..

Paddler Bhavina Patel Assured of Medal. టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్

By అంజి  Published on  28 Aug 2021 4:13 AM GMT
పారాలింపిక్స్‌లో భవీనా కొత్త చరిత్ర..

టోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత మహిళా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనాబెన్ పటేల అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల టేబుల్ టెన్నిస్‌ క్లాస్ -4 సింగిల్స్ విభాగం క్వార్టర్‌ ఫైనల్లో భవినా సంచన విజయం సాధించింది. కేవలం 18 నిమిషాల్లోనే 11 - 5, 11 - 6, 11 - 7తో సెర్బియాకు చెందిన ప్రపంచ ఐదో ర్యాంకర్‌ అయిన బొరిస్లావా పెరిచ్‌పై గెలుపొందింది. 2016 రియో పారాలింపిక్స్‌లో బొరిస్లావా పెరిచ్ స్వర్ణ పతకం నెగ్గింది. గేమ్‌ మొదలైనప్పటి నుంచే ఆధిపత్యం చెలాయించిన భవినా.. ప్రత్యర్థి శరీరాన్ని లక్ష్యంగా చేసుకొని విజయం సాధించింది.

వరుసగా మూడు రౌండ్లలో ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకుండా ముచ్చెమటలు పట్టించింది. భవనీ సెమీ ఫైనల్ చేరుకోవడం ద్వారా పతకం ఖాయం చేసుకుంది. నేడు చైనాకు చెందిన మియావో జాంగ్‌తో భవీనా తలపడనుంది. వఅంతకుముందు జరిగిన ఫ్రి క్వార్టర్‌లో సైతం ప్రపంచ 8వ ర్యాంకర్ అయిన బ్రెజిల్‌కు చెందిన జోన్‌ డి ఒలివీరపై భవీనా 12 - 10, 13 - 11, 11 - 6తో గెలిచింది. భవీనా స్వస్థలం గుజరాత్‌లోని వాద్‌నగర్‌. ఆమె 12 నెలలో వయసులోనే పోలియోబారిన పడింది. కోచ్‌ లలన్ ఆధ్వర్యంలో భవీనా టేబుల్ టెన్నిస్‌ నేర్చుకుంది. భవీనా గుజరాత్‌ యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది.


Next Story
Share it