INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పసికూన అయితే కాదు.

By Medi Samrat  Published on  22 Jun 2024 5:42 PM IST
INDvsBAN : భారత జట్టును టెన్షన్ పెడుతోంది అదే!!

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా భారత జట్టు నేడు బంగ్లాదేశ్ తో తలపడుతోంది. బంగ్లాదేశ్ జట్టు ప్రస్తుతం పసికూన అయితే కాదు. ఇప్పటికే చాలా సార్లు బంగ్లాదేశ్ చేతిలో భారత జట్టు భంగపడింది. అందుకే భారతజట్టు కూడా చాలా జాగ్రత్తగా ఈ మ్యాచ్ ను ఆడబోతోంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే భారత జట్టు సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమే. భారత జట్టు విజయాలు సాధిస్తూ ఉన్నా.. ఓపెనర్లు రాణించకపోవడం, మిడిలార్డర్ లో శివమ్ దూబే, లోయర్ ఆర్డర్ లో రవీంద్ర జడేజా కనీసం పరుగులు చేయకపోతూ ఉండడం ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి.

టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఆశించిన స్థాయిలో రాణించలేదు. స్టార్ బ్యాటర్ల నుండి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ నిరాశపరుస్తూనే ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ త్వరలోనే ఫామ్‌లోకి వస్తాడని భారత్‌ ఆశిస్తోంది. తొలి గేమ్‌లో ఐర్లాండ్‌పై హాఫ్ సెంచరీ చేసిన తర్వాత, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ ఇద్దరు స్టార్లు ఓపెనర్లుగా మంచి ఆరంభం ఇవ్వాలని అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. శివమ్ దూబే ఆట మరో ఆందోళన కలిగిస్తుంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ లలో ఎవరినో ఒకరిని తీసుకోవాలనే డిమాండ్స్ తెరపైకి వస్తున్నాయి. శనివారం నాడు బంగ్లా టైగర్స్ పై గెలిస్తే సెమీఫైనల్స్‌లో బెర్త్‌కు భారత జట్టు ఒక అడుగు దగ్గర అవుతుంది. భారత్ vs బంగ్లాదేశ్ మ్యాచ్ రాత్రి 8 గంటల నుండి స్టార్ స్పోర్ట్స్ లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అరగంట ముందు టాస్ పడనుంది. ఆంటిగ్వా లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం మ్యాచ్ కు వేదికగా నిలిచింది.

Next Story