సింపుల్‌గా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు.. భారత బృందాన్ని నడిపించిన మన్‌ప్రీత్, మేరీకోమ్
Olympics Starting Ceremony. ఒలింపిక్స్ ప్రాంభ వేడుకలు చాలా సాదాసీదాగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం
By Medi Samrat Published on
23 July 2021 2:07 PM GMT

ఒలింపిక్స్ ప్రాంభ వేడుకలు చాలా సాదాసీదాగా జరిగాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు మొదలయ్యాయి. జపాన్ చక్రవర్తి నరహిటో క్రీడలను ప్రారంభించారు. ప్రతిసారీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగే వేడుకలను ఈసారి ప్రేక్షకులు లేకుండానే సింపుల్‌గా నిర్వహిస్తున్నారు. జట్లు పరేడ్‌లో పాల్గొనే అథ్లెట్ల సంఖ్యను కూడా ఈసారి పరిమితం చేశారు.
ఇండియా తరఫున కేవలం 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు మాత్రమే పరేడ్‌లో పాల్గొంటున్నారు. భారత్ నుంచి మొత్తం 127 మంది అథ్లెట్లు పోటీ పడుతున్నారు. ఇక భారత బృందాన్ని హాకీ పురుషుల జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్, మహిళా బాక్సర్ మేరీకోమ్ త్రివర్ణ పతకాన్ని చేతబూని నడిపించారు.
మొత్తంగా ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌లో 11,500 మంది అథ్లెట్లు తలపడనున్నారు. 42 వేదికల్లో జరిగే విశ్వక్రీడల్లో 205 దేశాలతో పాటు ఓ శరణార్థి జట్టు కూడా పాల్గొననుంది. ఈ ఓపెనింగ్ వేడుకలకు హాజరైన అతిథుల్లో అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఉన్నారు.
Next Story