టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆలీ పోప్ టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు.

By Medi Samrat
Published on : 23 May 2025 8:06 PM IST

టెస్ట్ క్రికెట్‌లో అరుదైన ఫీట్ సాధించిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆలీ పోప్ టెస్టు క్రికెట్‌లో చరిత్ర సృష్టించాడు. జింబాబ్వేతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఓలీ పోప్ సెంచరీ చేసి ప్రత్యేక ఫీట్‌ను సాధించాడు.

నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్, జింబాబ్వే మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ జరుగుతోంది. మ్యాచ్ నాలుగో రోజు ఇంగ్లండ్ 565 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించారు. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఆలీ పోప్ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడారు.

ఓలీ పోప్‌కి ఇది 8వ టెస్టు సెంచరీ. ఈ సెంచరీ త‌ర్వాత‌ పోప్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఎనిమిది వేర్వేరు జట్లపై తన టెస్ట్ సెంచరీలు సాధించిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్‌మన్‌గా పోప్ నిలిచాడు. పోప్ 55 టెస్ట్ మ్యాచ్‌లలో 8 సెంచరీలు, 15 అర్ధ సెంచరీలతో 3,301 పరుగులు చేశాడు.

ఆలీ పోప్ ఎనిమిది టెస్టు సెంచరీలు

దక్షిణాఫ్రికా - 2020

న్యూజిలాండ్ - 2022

పాకిస్తాన్ - 2022

ఐర్లాండ్ - 2023

భారతదేశం- 2024

వెస్టిండీస్ - 2024

శ్రీలంక - 2024

జింబాబ్వే- 2025

2018లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఓలీ పోప్ 2020లో తన తొలి టెస్టు సెంచరీని సాధించాడు. దక్షిణాఫ్రికాపై ఓలీ పోప్ 135 పరుగులతో అజేయమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీని తర్వాత, అతను న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్, ఇండియా, వెస్టిండీస్, శ్రీలంకల‌పై సెంచరీలు చేశాడు.

జింబాబ్వేపై ఓలీ పోప్ 166 బంతుల్లో 171 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. త‌న‌ ఇన్నింగ్స్‌లో రెండు సిక్సర్లు, 24 ఫోర్లు ఉన్నాయి. ఒల్లీ పోప్‌తో పాటు డకెట్ 140, జాక్ క్రాలే 124 పరుగులు చేశారు. 58 పరుగుల వద్ద హ్యారీ బ్రూక్ ఔటయ్యాడు. ముజారబానీ మూడు వికెట్లు తీశాడు.

Next Story