ఐసీసీ వన్డే ప్రపంచ కప్ : టీమ్ ఇండియా పూర్తి షెడ్యూల్ వివరాలివిగో..
ODI World Cup 2023 India Schedule Venues Matches. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది.
By Medi Samrat
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. మంగళవారం ముంబైలో జరిగిన కార్యక్రమంలో మ్యాచ్‌లను అధికారికంగా ప్రకటించారు. ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాలో ఆడనుంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. అక్టోబర్ 15న పాకిస్థాన్‌తో భారత్ మ్యాచ్ ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. 11వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ తో ఢిల్లీ వేదికగా తలపడనుంది. 19వ తారీఖు బంగ్లాదేశ్‌ను పూణేలో ఢీకొట్టనుంది. 22న న్యూజిలాండ్ తో ధర్మశాలలో అమీతుమీ తేల్చుకోనుంది. 29న లక్నో వేదికగా ఇంగ్లాండ్ తో తలపడనుంది. నవంబర్ 2న క్వాలిఫయర్-2తో ముంబైలో మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 5న దక్షిణాఫ్రికా కోల్‌కతాలో, నవంబర్ 11న బెంగుళూరులో క్వాలిఫయర్-1 టీమిండియా మ్యాచ్‌లు ఉంటాయి.
ప్రపంచకప్ మ్యాచ్‌లు భారతదేశంలోని 10 నగరాల్లో జరుగుతాయి. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పుణె, బెంగళూరు, ముంబై, కోల్‌కతాలో మ్యాచ్‌లు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు గౌహతి, తిరువనంతపురంలో సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 3 వరకు వార్మప్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఈ ప్రపంచకప్‌లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. ఎనిమిది జట్లు ఇప్పటికే టోర్నమెంట్‌కు అర్హత సాధించాయి. మిగిలిన రెండు స్థానాల కోసం జట్లు జింబాబ్వేలో క్వాలిఫయర్ రౌండ్ ఆడుతున్నాయి, ఆరు జట్లు సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించాయి. వీటిలో రెండు జట్లు భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో ప్రధాన రౌండ్‌లో పాల్గొంటాయి. ఈ ప్రపంచకప్‌లో మిగతా తొమ్మిది జట్లతో ప్రతీ జట్టూ రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ఆడనున్నాయి. వీటిలో పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. గెలిచిన జట్లు ఫైనల్స్‌లో పోటీపడతాయి.