కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ కాలేడు.. కాబోయే సారథి ఎవరో చెప్పిన మాజీ వికెట్ కీపర్
ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రిషబ్ పంత్‌ను ఢిల్లీ రిటైన్ చేయలేదు.
By Medi Samrat Published on 17 Jan 2025 3:08 PM ISTఐపీఎల్ తదుపరి సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. రిషబ్ పంత్‌ను ఢిల్లీ రిటైన్ చేయలేదు. వేలంలో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ పంత్‌ను కొనుగోలు చేయలేకపోయింది. అయితే పంత్ స్థానంలో KL రాహుల్‌ని చేర్చుకుంది. అప్పటి నుండి IPL-2025లో రాహుల్ ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా ఉంటాడని ఊహాగానాలు వచ్చాయి. అయితే ఢిల్లీ మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ మాట్లాడుతూ.. కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉండడని చెప్పాడు. పంత్ 2018 నుంచి ఢిల్లీతోనే ఉన్నాడు. 2022 నుంచి జట్టుకు కెప్టెన్‌గా మారాడు. అయితే పంత్ కెప్టెన్సీలో జట్టు పెద్దగా రాణించలేకపోయింది. అయినా ఢిల్లీ జట్టు నుంచి పంత్ తప్పుకుంటాడని ఎవరూ ఊహించలేదు.
ఢిల్లీ తరఫున ఐపీఎల్ ఆడిన కార్తీక్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. రాహుల్ ఢిల్లీకి కెప్టెన్‌గా ఉండడని చెప్పాడు. కార్తీక్ ప్రకారం.. అక్షర్ పటేల్ జట్టు తదుపరి కెప్టెన్ అని పేర్కొన్నాడు. అక్షర్ పటేల్‌ను ఢిల్లీ జట్టులో ఉంచుకుంది. తాజాగా భారత టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.
క్రిక్‌బజ్ షోలో కార్తీక్ మాట్లాడుతూ.. "వైస్ కెప్టెన్సీకి అక్షర్ పటేల్‌కు అభినందనలు. ఇది అతనికి మంచి అవకాశం. అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు తదుపరి కెప్టెన్ అవుతాడు. ఇక్కడ అతనికి నాయకత్వం వహించే మంచి అవకాశం ఉంది. కాబట్టి అతనికి అభినందనలు అని పేర్కొన్నాడు.
మరో విధంగా చూస్తే రాహుల్‌కు ఐపీఎల్‌లో కెప్టెన్సీ అనుభవం ఉంది. అతడు గతంలో రెండు జట్లకు కెప్టెన్‌గా ఉన్నాడు. ఢిల్లీకి ముందు.. రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్‌లో ఉన్నాడు. మూడు సంవత్సరాల పాటు జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. దీనికి ముందు పంజాబ్ కింగ్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే.. కెప్టెన్‌గా రాహుల్ రికార్డు కూడా అంతంతమాత్రమే. అతడు సారధ్యంలో పంజాబ్ ప్పుడూ ప్లేఆఫ్స్‌కు వెళ్లలేదు. కానీ లక్నోను రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లాడు.