సంచలన నిర్ణయం తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.. ఏ దేశం ఒప్పుకుంటుందో..?
No more neutral venues for us. పాకిస్తాన్ లో క్రికెట్ ఆడడానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. 2009 లో లాహోర్‌లో
By Medi Samrat Published on 25 Sept 2021 5:23 PM ISTపాకిస్తాన్ లో క్రికెట్ ఆడడానికి ఏ దేశం కూడా ముందుకు రావడం లేదు. 2009 లో లాహోర్‌లో శ్రీలంక టీమ్ బస్సుపై ఇస్లామిస్ట్ మిలిటెంట్లు జరిపిన దాడిలో ఆరుగురు పోలీసులతో పాటు ఇద్దరు పౌరులు మరణించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్ బృందాలు పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరిస్తూనే ఉన్నాయి. ఇటీవలే న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు పాక్ పర్యటనను రద్దు చేసుకోవడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఆసీస్ పర్యటన డౌట్ గానే ఉంది. దీంతో మరోసారి పాకిస్తాన్ తమ సిరీస్ లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు షిఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ అతిధ్యం ఇచ్చే హోమ్ సిరీస్‌లను తటస్థ వేదికలలో ఇప్పటినుంచి నిర్వహించబోమని సృష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడానికి తమ దేశం చాలా సురక్షితం అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాక్‌తో సీరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత అన్ని దేశాల క్రికెట్ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించడనికి విముఖత చూపాయి. దీంతో పాక్‌తో జరగాల్సిన సీరీస్‌లను తటస్థ వేదికగా యూఏఈలో పీసీబీ నిర్వహించేది.
న్యూజిలాండ్ మ్యాచ్ మొదలవ్వడాని కంటే ముందే వైదొలగగా ఇంగ్లండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇటీవలే పాకిస్తాన్ పర్యటన నుండి పురుషులు మరియు మహిళలు, జట్లు రెండింటినీ ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకునట్లు తెలిపింది. ఇంగ్లండ్ జట్లు అక్టోబర్ 13, 14 తేదీలలో రావల్పిండిలో రెండు ట్వంటీ 20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మహిళల జట్టు అక్టోబర్ 17-21 వరకు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ ఇవేవీ పాక్ లో నిర్వహించడం లేదు. ఇక తటస్థ వేదికల్లో మ్యాచ్ ను నిర్వహించడానికి పాక్ క్రికెట్ బోర్డు ఒప్పుకోకపోవడంతో ఇక ఏ జట్టు కూడా పాక్ పర్యటనకు ఇప్పట్లో రావేమో..!