వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌-2024ను ప్ర‌క‌టించిన ఐసీసీ.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ ఆట‌గాళ్లు ఉన్నారు.. మ‌నోళ్లు ఎక్క‌డ‌..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది.

By Medi Samrat  Published on  24 Jan 2025 3:14 PM IST
వ‌న్డే టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌-2024ను ప్ర‌క‌టించిన ఐసీసీ.. ముగ్గురు ఆఫ్ఘనిస్థాన్ ఆట‌గాళ్లు ఉన్నారు.. మ‌నోళ్లు ఎక్క‌డ‌..?

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ ఆటగాళ్లతో కూడిన ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ శుక్రవారం ప్రకటించింది. ఈ జట్టులో 4 దేశాల ఆటగాళ్లకు చోటు కల్పించారు. జట్టు కెప్టెన్సీని శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకకు అప్పగించారు. గతేడాది వన్డేల్లో అసలంక ప్రదర్శన అద్భుతంగా ఉంది. అసలంక 16 వన్డేల్లో 50.2 సగటుతో 605 పరుగులు చేశాడు. అసలంక ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు చేశాడు.

ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024లో శ్రీలంక నుండి నలుగురు, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ల నుండి ముగ్గురు చొప్పున‌, వెస్టిండీస్ నుండి ఒకరు ఉన్నారు. ఈ జట్టులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల నుంచి ఏ ఆటగాడికి చోటు దక్కలేదు.

గతేడాది భారత జట్టు కేవలం 3 వన్డే మ్యాచ్‌లు మాత్రమే ఆడింది. 2024లో భారత్-శ్రీలంక మధ్య 3 వన్డే మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో భారత్ 2 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడగా, 1 మ్యాచ్ టై అయింది. గత ఏడాది శ్రీలంక 18 వన్డే మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌ల‌లో విజయం సాధించింది. గత ఏడాది పాకిస్థాన్ క్రికెట్ జట్టు 9 వన్డే మ్యాచ్‌లు ఆడి 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరోవైపు 2024లో ఆఫ్ఘనిస్తాన్ 14 మ్యాచ్‌లు ఆడి 8 గెలిచింది.

శ్రీలంక నుంచి చరిత్ అసలంక, కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సాంక, వనిందు హసరంగా.. ఆఫ్ఘనిస్థాన్ నుంచి రహ్మానుల్లా గుర్బాజ్, అజ్మతుల్లా ఉమర్‌జాయ్, ఏఎం గజన్‌ఫర్.. పాకిస్థాన్ నుంచి సామ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, హరీస్ రౌఫ్ ఎంపిక‌వ‌గా.. 2023లో అరంగేట్రం చేసిన వెస్టిండీస్ ఆటగాడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌కు కూడా ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది. రూథర్‌ఫోర్డ్ 9 మ్యాచ్‌ల్లో 106.2 సగటుతో 425 పరుగులు చేశాడు. ఆల్ స్టార్ XIలో ఆసియాయేతర ఆటగాడు రూథర్‌ఫోర్డ్ మాత్ర‌మే కావ‌డం విశేషం.

ICC పురుషుల ODI టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024

చరిత్ అసలంక (కెప్టెన్) (శ్రీలంక), సామ్ అయూబ్ (పాకిస్థాన్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్థాన్), పాతుమ్ నిస్సాంక (శ్రీలంక), కుసల్ మెండిస్ (వికెట్ కీపర్) (శ్రీలంక), షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ (వెస్టిండీస్), అజ్మతుల్లా ఉమర్‌స్తాయ్ (ఆఫ్ఘానిస్థాన్) ), వనిందు హసరంగా (శ్రీలంక), షాహీన్ షా ఆఫ్రిది (పాకిస్థాన్), హరీస్ రౌఫ్ (పాకిస్థాన్), ఏఎం గజన్‌ఫర్ (ఆఫ్ఘనిస్థాన్).

Next Story