ఐపీఎల్ మ్యాచ్ వేదికల్లో మార్పు.. ఫైనల్ ఎక్కడంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుందని భారత క్రికెట్ బోర్డు (BCCI) మంగళవారం, మే 20న ప్రకటించింది.

By Medi Samrat
Published on : 20 May 2025 6:30 PM IST

ఐపీఎల్ మ్యాచ్ వేదికల్లో మార్పు.. ఫైనల్ ఎక్కడంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఫైనల్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుందని భారత క్రికెట్ బోర్డు (BCCI) మంగళవారం, మే 20న ప్రకటించింది. ఫైనల్‌తో పాటు, అహ్మదాబాద్ క్వాలిఫైయర్ 2కి కూడా ఆతిథ్యం ఇస్తుంది. పంజాబ్ కింగ్స్ సొంత గడ్డ ముల్లాన్‌పూర్ స్టేడియంలో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ నిర్వహించనున్నారు.

కోల్‌కతా వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ నిర్ణయం తీసుకుంది. కోల్‌కతాలో ఫైనల్‌తో సహా రెండు ప్లేఆఫ్ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. హైదరాబాద్‌లో జరగాల్సిన మిగతా రెండు మ్యాచ్‌లను రాజీవ్ గాంధీ స్టేడియం నుండి ముల్లాన్‌పూర్‌కు ఇచ్చారు.

ఐపీఎల్ మ్యాచ్ వేదికల్లో మార్పు.. ఫైనల్ ఎక్కడంటే.. ప్లేఆఫ్స్ తేదీలు:

29-మే-25 (గురు) – సాయంత్రం 7:30: క్వాలిఫయర్ 1 (ముల్లన్పూర్)

30-మే-25 (శుక్ర) – సాయంత్రం 7:30: ఎలిమినేటర్ (ముల్లన్పూర్)

01-జూన్-25 (ఆదివారం) – సాయంత్రం 7:30: క్వాలిఫయర్ 2 (అహ్మదాబాద్)

03-జూన్-25 (మంగళవారం) – సాయంత్రం 7:30: ఫైనల్ (అహ్మదాబాద్)

Next Story