యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ 25 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో నాలుగో టెస్టులో ఆల్‌రౌండర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచారని కొనియాడాడు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నగదు బహుమతిని నితీశ్‌కు అందజేస్తామని కేశినేని శివనాథ్ తెలిపారు. నేటి యువతకు నితీష్ రోల్ మోడల్ అని కొనియాడిన ఆయన, క్రికెట్‌లో యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం సిద్ధమన్నారు. అమరావతిలో అత్యాధునిక స్టేడియం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.
బాక్సింగ్ డే టెస్ట్ మూడో రోజు శనివారం నాడు నితీష్ రెడ్డి తన మొట్టమొదటి అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి 99 పరుగుల వద్ద బౌండరీ బాది తొలి టెస్ట్ సెంచరీని అందుకున్నాడు. 171 బంతుల్లో మూడంకెల మార్కును చేరుకున్నాడు.