మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ ఫైనల్ కు హైదరాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ చేరింది. బుధవారం సాయంత్రం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె బ్రెజిల్‌కు చెందిన కరోలినా అల్మిడాను చిత్తు చేసి ఫైనల్ కు చేరింది. 52 కిలోల విభాగంలో బరిలోకి దిగిన నిఖత్ ఫైనల్స్‌కు వెళ్ళింది. ఇప్పటిదాకా ఈ టైటిల్‌ను సాధించిన భారత మహిళా బాక్సర్లలో మేరీ కామ్, సరితా దేవి, జెన్నీ, లేఖ ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన నిఖత్ వీరి సరసన చేరడానికి ఒక అడుగు దూరంలో ఉంది.
బుధవారం ఇస్తాంబుల్‌లో జరిగిన మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లలో నిఖత్ జరీన్ మాత్రమే ఫైనల్‌లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు. భారత్ కు చెందిన మనీషా మౌన్ (57 కేజీలు), పర్వీన్ హుడా (63 కేజీలు) కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు.