మెరుపు సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించిన నికోలస్ పూరన్
వెస్టిండీస్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌పై తనదైన ముద్ర వేశాడు.
By Medi Samrat Published on 30 Sep 2024 5:25 AM GMTవెస్టిండీస్‌కు చెందిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ నికోలస్ పూరన్ భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌పై తనదైన ముద్ర వేశాడు. పూరన్ బ్యాట్ నుంచి ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది. దీంతో CPL 2024లో మెరుపు సెంచరీని చేసి ఒంటరిగా జట్టును గెలిపించాడు.
CPL 2024 30వ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ గయానా అమెజాన్ వారియర్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్‌లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో తరఫున నికోలస్ పూరన్ 59 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు చేశాడు.
పూరన్ తప్ప జట్టులో మరే ఆటగాడు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. కేవలం 9 పరుగులకే ఆండ్రీ రస్సెల్ ఔటయ్యాడు. టిమ్ డేవిడ్ ఖాతా కూడా తెరవలేదు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రిన్‌బాగో జట్టు 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం గయానా అమెజాన్ వారియర్స్ 18.5 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. జట్టులో ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. రహ్మానుల్లా గుర్బాజ్ మాత్రమే 36 పరుగులు చేశాడు. షాయ్ హోప్ 26 పరుగులకే ఔటయ్యాడు. దీంతో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ జట్టు 74 పరుగుల తేడాతో అమెజాన్ వారియర్స్ జట్టుపై విజయం సాధించింది.
అంతకుముందు నికోలస్ పూరన్ టీ20లో సెంచరీ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. అతడు ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక T20 పరుగులు (2024) సాధించిన పరంగా పాకిస్థాన్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్‌ను అధిగమించాడు. పురాన్ టీ20లో ఇప్పటివరకు 2,195 పరుగులు చేయగా, మహ్మద్ రిజ్వాన్ 45 ఇన్నింగ్స్‌ల్లో (2021) 2,036 పరుగులు చేశాడు.