ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు ఘ‌న‌స్వాగ‌తం పలికిన‌ అభిమానులు

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచి సింగపూర్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న డి.గుకేష్‌కు స్వాగతం పలికేందుకు సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు.

By Medi Samrat  Published on  16 Dec 2024 10:12 AM GMT
ప్రపంచ ఛాంపియన్ గుకేశ్‌కు ఘ‌న‌స్వాగ‌తం పలికిన‌ అభిమానులు

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలిచి సింగపూర్‌ నుంచి స్వదేశానికి చేరుకున్న డి.గుకేష్‌కు స్వాగతం పలికేందుకు సోమవారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి వేలాదిగా అభిమానులు తరలివచ్చారు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న రెండో భారతీయుడిగా గుకేశ్ నిలిచాడు. డి.గుకేష్‌కు తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎస్‌డిఎటి) అధికారులు, నగరంలోని ప్రముఖ చెస్ కేంద్రమైన వెలమ్మాళ్ విద్యాలయ విద్యార్థులు ప్రత్యేక స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా గుకేశ్ మాట్లాడుతూ.. 'నేను ఇక్కడకు రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాకు ఉన్న మద్దతును నేను చూడగలను.. మీరు నాకు చాలా శక్తిని ఇచ్చారు. ట్రోఫీని భారత్‌కు తిరిగి తీసుకురావడం చాలా ముఖ్యం. ఈ స్వాగతానికి ధన్యవాదాలు. రాబోయే కొద్ది రోజుల్లో మనం కలిసి జరుపుకోవడానికి గొప్ప సమయం ఉంటుందని నేను ఆశిస్తున్నానని అన్నాడు. గుకేశ్‌ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లగానే పూలమాలతో వేల సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టారు. కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్‌ను చూసేందుకు అభిమానులు చాలా ఆసక్తిగా ఉన్నారు. యువ ఛాంపియన్‌ను అభినందించేందుకు ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ అధికారులు కూడా హాజరయ్యారు. SDAT అధికారులు గుకేశ్‌కు శాలువా కప్పి అతని చారిత్రాత్మక విజయానికి కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచ ఛాంపియన్‌ను అతని నివాసానికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కారును విమానాశ్రయం వద్ద మోహరించారు. ఇందులో గుకేష్ ఫోటోగ్రాఫ్‌లతోస‌హా '18 ఎట్ 18' అనే ట్యాగ్‌లైన్ ఉంది. నిజానికి, గుకేశ్ చెస్‌లో 18వ తిరుగులేని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. సింగపూర్‌లో జరిగిన 14 మ్యాచ్‌ల ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో అతడు చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించాడు. గ్రేట్ గ్యారీ కాస్పరోవ్ రికార్డును బద్దలు కొట్టి, అత్యంత పిన్న వయస్కుడైన ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా గుకేశ్ నిలిచాడు.

Next Story