సఫారీలను దెబ్బకు దెబ్బ తీసిన కివీస్..!

సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం మౌంట్‌ మౌంగనీ వేదికగా తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

By -  Medi Samrat
Published on : 17 March 2026 5:20 PM IST

సఫారీలను దెబ్బకు దెబ్బ తీసిన కివీస్..!

సౌతాఫ్రికాపై న్యూజిలాండ్‌ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం మౌంట్‌ మౌంగనీ వేదికగా తొలి టీ20లో తలపడ్డ న్యూజిలాండ్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తాజాగా హామిల్టన్‌లో సఫారీల దూకుడుకు చెక్ పెట్టింది.

ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. నిక్‌ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్‌ మిచెల్‌ సాంట్నర్‌ (14 బంతుల్లో 21), కోల్‌ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్‌ క్లార్క్‌సన్‌ (9 బంతుల్లో 26) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్‌ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్‌ ముల్డర్‌ రెండు వికెట్లు, గెరాల్డ్‌ కోయెట్జి, ఒట్నీల్‌ బార్ట్‌మాన్‌, కెప్టెన్‌ కేశవ్‌ మహరాజ్‌, జార్జ్‌ లిండే తలా ఒక వికెట్‌ తీశారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా మొదట్నుండి ఆఖరి వరకూ తడబడుతూనే వచ్చింది. జార్జ్‌ లిండే 12 బంతుల్లో 33 పరుగులు సాధించడం మినహా మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.1 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌ అయింది.

Next Story