మూడో వన్డేలో పాక్‌ను చిత్తు చేసి సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కివీస్
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.
By Medi Samrat
పాకిస్థాన్‌తో జరిగిన మూడో వన్డేలో న్యూజిలాండ్ 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. బే ఓవల్ వేదికగా జరిగిన మూడో మ్యాచ్‌లో విజయం సాధించి పాకిస్థాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. వర్షం కారణంగా ఔట్ ఫీల్డ్ తడిగా ఉండడంతో మ్యాచ్‌ను 42 ఓవర్లకు కుదించారు. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 265 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. దానికి సమాధానంగా పాకిస్థాన్ జట్టు 40 ఓవర్లలో 220 పరుగులకే ఆలౌటైంది. కివీ జట్టు తరఫున బెన్ సియర్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు.
న్యూజిలాండ్ జట్టులో రీస్ మారియు 61 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు చేశాడు. అలాగే కెప్టెన్ మైకేల్ బ్రేస్‌వెల్ 40 బంతుల్లో 59 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ మ్యాచ్‌లో మైఖేల్ 59 పరుగులు చేశాడు. మ్యాచ్ తర్వాత ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఇమామ్ ఉల్ హక్ గాయపడి రిటైర్ అయ్యాడు. ఇమామ్ ఔటైన తర్వాత ఉస్మాన్ ఖాన్ 17 బంతుల్లో 12 పరుగులు చేయగలిగాడు. బాబర్ అజామ్ 50 పరుగులు చేశాడు. అబ్దుల్లా షఫీక్ అతనికి మద్దతుగా నిలిచాడు. అబ్దుల్లా 56 బంతుల్లో 33 పరుగులు చేశాడు. కెప్టెన్ రిజ్వాన్ 33 పరుగులు చేశాడు. బ్యాట్స్‌మెన్ ఎవరూ నిలదొక్కుకోకపోవడంతో పాక్ జట్టు 40 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. కివీ పేసర్ బెన్ సియర్స్ పాకిస్తాన్ బ్యాటింగ్ లైనప్‌ను నాశనం చేశాడు. 9 ఓవర్లలో కేవలం 34 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.