డెలివ‌రీ బాయ్‌గా మారిన క్రికెట‌ర్.. ధైర్యం చెబుతున్న నెటీజ‌న్లు

Netherlands cricketer reveals his hardship after T20 World Cup postponement. క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రీడారంగం కుదేలైంది.

By Medi Samrat  Published on  16 Nov 2020 7:01 AM GMT
డెలివ‌రీ బాయ్‌గా మారిన క్రికెట‌ర్.. ధైర్యం చెబుతున్న నెటీజ‌న్లు

క‌రోనా వైర‌స్ కార‌ణంగా క్రీడారంగం కుదేలైంది. ఒలంపిక్స్ , టీ20 ప్ర‌పంచ‌క‌ప్ స‌హా చాలా టోర్నీలు వాయిదా ప‌డ‌గా.. మ‌రికొన్ని ర‌ద్దు అయ్యాయి. దీంతో ఆయా క్రీడ‌ల్లో పాల్గొనే క్రీడాకారుల్లో చాలా మంది ఆర్థికంగా న‌ష్ట‌పోయారు. క్రీడ‌ల్లో పాల్గొంటే మ్యాచ్ ఫీజులు వ‌చ్చేవి. క్రీడలు ర‌ద్దు అవ్వ‌డంతో పాటు చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించ‌డంతో.. స్టార్ క్రీడాకారుల‌కు ఏం కాలేదు కానీ.. సాదార‌ణ క్రీడాకారుల‌కు పూట గ‌డ‌వ‌డం కూడా క‌ష్ట‌మైంది.త‌మ జీవితాల‌ను క‌రోనా ఎంత అత‌లాకుతం చేసిదో తెలియ‌స్తూ.. ఓ క్రికెట్ ఆట‌గాడు చేసిన ట్వీట్.. అత‌డి దుర్భ‌ర ప‌రిస్థితిని తెలియ‌జేస్తుంది. భార‌త్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో క్రికెట్ ఆడే ఆట‌గాళ్లు కోట్ల‌లో సంపాదిస్తారు గానీ.. జింబాబ్వే, నెద‌ర్లాండ్ వంటి చిన్న దేశాల జాతీయ జ‌ట్లల‌లో ఆడే ఆటగాళ్ల సంపాద‌న అంతంత మాత్ర‌మే. మ్యాచ్‌లు ఆడితేనే పొట్ట‌నిండేది. కొవిడ్‌-19త‌మ జీవితాల‌ను ఎంత‌లా అత‌లాకుత‌లం చేసిందో వెల్ల‌డిస్తూ నెద‌ర్లాండ్ క్రికెట‌ర్ పాల్ వాన్ మీకెరెన్ చేసిన ట్వీట్ అద్దం ప‌డుతోంది. దేశం కోసం ఆడాల్సిన తాను ప్ర‌స్తుతం కుటుంబాన్ని పోషించుకోవ‌డానికి డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తున్న‌ట్లు ట్వీట్ చేశాడు.

అస‌లైతే షెడ్యూల్ ప్ర‌కారం.. ఇప్పుడు ఆస్ట్రేలియా వేదిక‌గా టీ20 ప్ర‌పంచ‌క‌ప్(అక్టోబ‌ర్ 18 నుంచి న‌వంబ‌ర్ 15) జ‌ర‌గాల్సిఉంది. అయితే.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఈ టోర్నీని 2022 కి ‌వాయిదా వేశారు. అయితే.. ఆదివారం ఈఎస్‌పీఎన్ క్రిక్ఇన్ఫో.. క‌రోనా లేక‌పోతే మెల్‌బోర్న్ మైదానంలో ఫైన‌ల్ వీక్షించేవారిమ‌ని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను పాల్ వాన్ రీ ట్వీట్ చేస్తూ.. ఈ రోజు క్రికెట్ ఆడాల్సి ఉంది. కానీ ప్ర‌స్తుతం శీతాకాలం నెల‌ల్ని గ‌డిపేందుకు ఉబ‌ర్ ఈట్స్‌లో డెలివ‌రీ బాయ్‌గా ప‌నిచేస్తున్నాని.. విధి ఎంతో విచిత్ర‌మైందని, ప‌రిస్థితుల్ని మార్చేస్తుంద‌ని.. అయినా న‌వ్వుతూ మ‌నం ముందు పోవాల్సి ఉంద‌ని ట్వీట్ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెటింట్లో వైర‌ల్‌గా మారింది. మ‌ళ్లీ క్రికెట్ ఆడే రోజు త్వ‌ర‌లో రానుంద‌ని నెటీజ‌న్లు ఆ క్రికెట‌ర్‌కు ధైర్యం చెబుతున్నారు.


Next Story
Share it