కోహ్లీ టీమ్‌కు కోచింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు సొంత జ‌ట్టును ఓడించేందుకు శ్రీలంక వెళ్లాడు..!

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మాత్రమే ఆడాడు.

By Medi Samrat  Published on  12 Nov 2024 6:59 PM IST
కోహ్లీ టీమ్‌కు కోచింగ్ ఇచ్చాడు.. ఇప్పుడు సొంత జ‌ట్టును ఓడించేందుకు శ్రీలంక వెళ్లాడు..!

ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మాత్రమే ఆడాడు. ఈ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అయితే 2021లో జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. ఫాఫ్ డు ప్లెసిస్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు, అతని నాయకత్వంలో RCB ఈ సంవత్సరం ప్లేఆప్స్‌ ఆడింది. IPL-2024లో RCB బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేసిన నీల్ మెకెంజీ ఇప్పుడు శ్రీలంక జట్టులో చేరాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్‌లో టీమ్‌ఇండియా నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. దీని తర్వాత శ్రీలంక జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈలోపే శ్రీలంక క్రికెట్ బోర్డు దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్ మెకెంజీని బ్యాటింగ్ సలహాదారుగా నియమించింది.

మెకెంజీ నియామకంపై శ్రీలంక క్రికెట్ సీఈవో ఆష్లే డి సిల్వా మాట్లాడుతూ.. దక్షిణాఫ్రికాలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి.. తదనుగుణంగా ఆడటానికి అతని రాక జట్టుకు సహాయపడుతుందని అన్నారు. దక్షిణాఫ్రికాలోని పరిస్థితులపై మెకెంజీ విలువైన, లోతైన జ్ఞానం.. శ్రీలంక ఆటగాళ్లకు ఇక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.

మెకెంజీ 2009లో రిటైర‌య్యాడు. దీని తర్వాత చాలా జట్లకు కోచ్‌గా పనిచేశాడు. 2018 సంవత్సరంలో, మెకెంజీ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ అయ్యాడు. 2020లో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో మెకెంజీ ఐపీఎల్ టీమ్ RCBకి బ్యాటింగ్ కోచ్ అయ్యాడు.

నవంబర్ 27 నుంచి కింగ్స్‌మీడ్ డర్బన్‌లో శ్రీలంక-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 5 నుంచి రెండో టెస్టు మ్యాచ్‌కు గాబ్రేఖాలోని సెయింట్ జార్జ్ పార్క్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ శ్రీలంక, దక్షిణాఫ్రికా రెండింటికీ చాలా కీలకం. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో శ్రీలంక పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఈ జట్టు ఇటీవల స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో న్యూజిలాండ్‌ను ఓడించింది.

Next Story