చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం

Neeraj Chopra wins India's first gold medal. భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు

By Medi Samrat  Published on  7 Aug 2021 1:58 PM GMT
చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా.. అథ్లెటిక్స్ లో భారత్ కు తొలి స్వర్ణం

భారత జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలో భారత్ కు అథ్లెటిక్స్ లో తొలి స్వర్ణం అందించాడు. ఒలింపిక్స్ లో భారత్ కు ఇప్పటివరకు ఇతర క్రీడాంశాల్లో స్వర్ణం అందినా.. అథ్లెటిక్స్ లో స్వర్ణం అందని ద్రాక్షలా ఊరిస్తూనే ఉంది. తాజాగా నీరజ్ చోప్రా అద్భుత ప్రదర్శనతో భారత క్రీడారంగానికి ఆ లోటు కూడా తీరిపోయింది. ఇవాళ జరిగిన జావెలిన్ త్రో ఫైనల్స్ లో తిరుగులేని బలంతో ప్రత్యర్థులను వెనక్కి నెట్టి ప్రథమస్థానం కైవసం చేసుకున్నాడు. జావెలిన్ ను 87.58 మీటర్లు విసిరి గోల్డ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. ఈ పతకంతో భారత్ కు టోక్యో ఒలింపిక్స్ లో మొత్తం 7 పతకాలు లభించినట్టయింది. ఒక స్వర్ణం, రెండు రజతాలు, 4 కాంస్యాలు భారత్ ఖాతాలో చేరాయి.


Next Story