సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించిన‌ నీరజ్ చోప్రా..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుభారంభం చేశాడు.

By Medi Samrat  Published on  6 Aug 2024 3:47 PM IST
సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు అర్హత సాధించిన‌ నీరజ్ చోప్రా..!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా శుభారంభం చేశాడు. తొలి అర్హత పోటిలోనే ఫైనల్‌కు అర్హత సాధించాడు. నీరజ్ గ్రూప్ B క్వాలిఫికేషన్‌లో మొదటి స్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా తన మొదటి ప్రయత్నంలో 89.34 మీటర్ల త్రో తో సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు. ఇది 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ కంటే చాలా ఎక్కువ అవ‌డం విశేషం. అంటే క్వాలిఫికేషన్‌లో 84 మీటర్లు విసిరిన అథ్లెట్లు నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తారు.

ఫైనల్‌లో కూడా నీరజ్ నుండి ఇదే విధమైన ప్రదర్శన ఆశిస్తున్నారు భార‌త అభిమానులు. నీరజ్‌తో పాటు అతని ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా తొలి ప్రయత్నంలో అద్భుత ప్రదర్శన చేసి 86.59 మీటర్లు విసిరి ఫైనల్‌కు అర్హత సాధించాడు. నీరజ్ మాదిరిగానే ఇది కూడా అర్షద్‌కి ఈ సీజన్‌లో అత్యుత్తమ త్రో.

నీరజ్ చోప్రా టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అతడు మరోసారి ఆ ప్రదర్శనను పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. నీరజ్‌ను క్వాలిఫికేషన్‌లో గ్రూప్‌ బిలో చేర్చారు. అతని ప్రత్యర్థి పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ కూడా అదే గ్రూపులో ఉండ‌టం విశేషం.

Next Story